
Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కామెడీ, యాక్షన్, రొమాంటిక్ అన్ని కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి.. ఇప్పటి వరకు మాస్ రాజా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య చిరుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మెప్పించాడు.
ధమాకా, వాల్తేరు వంటి రెండు సూపర్ హిట్స్ వెంటవెంటనే పడేసరికి ఈయన కెరీర్ మళ్ళీ స్పీడ్ అయ్యింది. ఇక ప్రస్తుతం ప్రజెంట్ ఈయన వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాతో మొదటిసారి రవితేజ పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి..
ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. రాజమండ్రి హావ్ లాక్ బ్రిడ్జి మీద గ్రాండ్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా తెలుగు సహా మిగిలిన నాలుగు భాషల్లో ఒక్కో భాషలో ఒక్కో హీరో ఈ ఫస్ట్ లుక్ వీడియోను డిజిటల్ గా రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయడంతో పాటు వాయిస్ కూడా అందించారు.
ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో వెంకటేష్ వాయిస్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. 1970ల కాలంలో టైగర్ జోన్ గా పేరు పొందిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి ఆ ఊరు గురించి వెంకటేష్ వాయిస్ లో ఎంతో పవర్ ఫుల్ గా చెప్పడం బాగా ఆకట్టుకుంది.. అప్పట్లో రియల్ గా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. చూడాలి మాస్ రాజా ఎలా మెప్పిస్తాడో..