AP CM YS Jagan : ఏపీలో వివిధ సంక్షేమ పథకాలతో జగన్ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనన్ని పథకాలతో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల ఆదరణను పొందుతున్నారు. అయితే తాజాగా అయన మరో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏపీలో ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ను అందజేస్తామని ప్రకటించబోతున్నట్లు తెలిసింది. మరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్ పలు కీ లక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతూ ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ ప్రజలకు తన సంక్షేమ పథకాలతో దగ్గరవుతున్నారు. ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. వాలంటీర్ల ద్వారా ఇప్పటికే ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరవేస్తుండగా, 2024 ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే రాష్ట్రానికి కావాల్సిన వి సాధించుకుంటున్నారు.
అయితే తాజాగా జగన్ తీసుకునే నిర్ణయం పలు వర్గాల్లో ఆనందాన్ని రేపుతున్నది. కుటుంబంలో ఇద్దరికీ కూడా పింఛనిచ్చేలా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అధికారులు ఈ మేరకు సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ సర్వేలో భాగంగా లబ్ధిదారుల కుటుంబంలో మరెవరైనా పింఛన్ పథకానికి అర్హులు ఉన్నారా అనే కోణంలో రిపోర్టు తయారు చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇలా అందరి వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లుగా వైసీపీ శ్రేణుల నుంచి టాక్ వినిపిస్తున్నది
ReplyForward
|