32.6 C
India
Saturday, May 18, 2024
More

    Hansika : హన్సిక హర్రర్ మూవీల టెర్రర్

    Date:

    Hansika
    Hansika Guardian Movie

    Hansika : తెలుగులో బబ్లీ గర్ల్ గా పేరొందిన హన్సిక మెత్వానీ ప్రస్తుతం హర్రర్ మూవీస్ తో హడలెత్తిస్తోంది. హర్రర్ మూవీలే చేయడమే పెట్టుకున్నట్లు వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. మొన్నటి వరకు పార్టనర్, 105, మై నేమ్ ఈజ్ శ్రుతి, మినిట్స్, సినిమాలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చి మెప్పించాయి. ప్రస్తుతం ఇదే పంథాలో హన్సిక గార్డియన్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ గార్డియన్ ను చేసింది.

    ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయి వెంటనే వెళ్లిపోయింది. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఓవర్సీస్ లో సింప్లిసౌత్ అనే ఓటీటీ ప్లాట్ పాంలో రిలీజ్ అయింది. ఈ సినిమా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. మే 3న సింప్లిసౌత్ అనే ఓటీటీ లో రిలీజ్ కాగా.. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లో రానున్నట్లు సమాచారం.

    హన్సిక ప్రస్తుతం ఈ హర్రర్ మూవీస్ వల్ల లవ్, ఫ్యామీలీ మూవీస్ కు  దూరమైంది. వరుసగా ఈ సినిమాలే చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గార్డియన్ మూవీలో హన్సిక (అపర్ణ) ఇంటిరియర్ డిజైనర్ గా పని చేస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ఆమె గాయపడుతుంది. దీంతో ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. ఆమెను ఒక ఆత్మ ఆవహించడం.. హన్సిక శరీరంతోనే ఆ ఆత్మ రివేంజ్ తీర్చుకోవడం జరుగుతుంది.

    ఈ సినిమా రోటీన్ గానే ఉండడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అపర్ణ ఆత్మ లోకి వచ్చిన వారెవరూ ఎందుకు కొంతమందిని చంపాలని అనుకుంటున్నారు. అపర్ణ శరీరంలోకి ఆత్మ రావడానికి గల కారణాలు.. చివరికి క్లైమాక్స్ లో ఏం జరుగుతుందనేది గార్డియన్ మూవీని చూస్తేనే తెలుస్తుంది. అయితే ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా ఓటీటీలో త్వరలోనే రానుంది. అయితే ఆడియన్స్ హన్సిక అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడా గార్డియన్ రిలీజ్ అని ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular