35.8 C
India
Monday, May 20, 2024
More

    Hyderabad : అప్పట్లో హైదరాబాద్ ఇలా ఉండేది.. రేర్ ఫొటోలు

    Date:

    Hyderabad Rare photos
    Hyderabad Rare photos

    Hyderabad :

    హైదరాబాద్ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. దేశంలో భిన్నమైన ప్రాంతం వారసత్వ పరంగా, భౌగోళికంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా.. ఇలా అదీ ఇదీ అని చెప్పడం కాదుగానీ. ఏదైనా సరే అన్నింట్లో హైదరాబాద్ నెం.1 అంటే ఎటువంటి సందేహం లేదు. అయితే భారతదేశానికి స్వతంత్రం రాక ముందు బ్రిటీష్ పాలనలో హైదరాబాద్ చాలా పెద్దగా ఉండేది. 3 భాషలు కలిసి ఉండేవి. ఇటు తెలుగు, మరాఠీ, కన్నడ అంటే హైదరాబాద్ లో 8 తెలంగాణ జిల్లాలు, 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలు కలిసి ఉండేవి.

    కుతుబ్ షాహీ వంశస్తుడు ‘మహమ్మద్ కులీకుతుబ్ షా’ మూసీ ఒడ్డున 1590 దశకంలో హైదరాబాద్ నిర్మించాడు. గోల్కొండలో నీటి సమస్య ఉండడంతో పాలనను ఇక్కడి నుంచి కొనసాగించారు. ఇక్కడి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పాలించారు.

    400 ఏళ్లకు పైగా ఈ నగరానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నవాబులు నిర్మించిన హైదరాబాద్ కు ముందు చించలం పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా వచ్చి గోల్కొండ మొత్తం అతలాకుతలమైంది. దీంతో నవాబ్ కులీ కుతుబ్ షా గోల్కొండ నుంచి చించలంకు వచ్చి బస చేశాడు. కలరా తగ్గిన తర్వాత గోల్కొండకు వెళ్లేప్పుడు బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు.

    1594లో నాలుగో ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరుతో ఈ నగరం నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పెట్టింది పేరుగా ఉండేది. దేశానికి స్వతంత్ర్యం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజధాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఉండేవి.

    రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ దేశ రాజధానికి కావలసిన అన్ని అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయన్నారు. కాబట్టి ఏడాదికి ఒక్కసారి అయినా హైదరాబాద్ లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆయన సూచనతోనే రాష్ట్రపతి నిలయాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. 1956 కాలంలో హైదరాబాద్ ఇండియాలోనే 5వ పెద్ద నగరం.

    1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్ విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారీగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠా ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ కర్ణాటకలో కలిపారు. అలా ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. దేశానికి స్వతంత్య్రం రాక ముందు నుంచే హైదరాబాద్ లో అన్ని వసతులు ఉండేవి. అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..

    #01 నిజాం వ్యక్తిగత ఏనుగు
    #02 ఫలక్‌నుమా ప్యాలెస్, హైదరాబాద్
    #03 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
    #04 రాష్ట్ర అశ్విక దళం హైదరాబాద్ వీధుల గుండా “లాంగర్” ఊరేగింపును (1948)
    #05 నిజాం గార్డ్ కట్టు
    #06 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
    #07 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
    #08 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
    #09 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
    #10 మక్కా మసీదు
    #11 చౌమహేల ప్యాలెస్ యొక్క డ్రాయింగ్ రూమ్..
    #12 నిజాం చౌమహేల ప్యాలెస్
    #13 చార్మినార్:
    #14 అఫ్జల్గంజ్ లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ
    #15 హైదరాబాద్ లో ఉన్న కొన్ని మిల్స్

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...