Maldives President : మాల్దీవులు ఇప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. భారత్ తో విభేదాలు వచ్చాక దానికి కంటి మీద కునుకు పట్టడం లేదు. మన దేశంలో పర్యాటకం డెవలప్ మెంట్ కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్ ను ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అక్కడి మంత్రులు మన దేశ ఔన్నత్యం విషయంలో నోరు జారడంతో దానికి ఇబ్బందులు మొదలయ్యాయి.
ఇప్పుడు అక్కడ అధికార మార్పిడికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రక్తపాతం చోటుచేసుకుంటుందని భావిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మోయిజ్జును గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అవి భారత్ కు అనుకూలంగా ఉండటంతో అక్కడి ప్రజలు మనదేశంపై అక్కసు వెళ్లబోసుకుంటున్నాయి. భారత్ కావాలనే కుట్రతో ఇదంతా చేయిస్తుందని ఆరోపణలు చేస్తోంది.
అక్కడి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఆ దేశ అధ్యక్షుడిని తొలగించాలని చూస్తోంది. అది తెలియని అధ్యక్షుడు మనదేశంపై కారాలు మిరియాలు నూరుతుండటం గమనార్హం. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు అవుతారు. ఇతరులకు ఏం సంబంధం ఉంటుంది. అనవసరంగా మనపై అబాండాలు వేస్తూ తన కుట్రలను చూపిస్తోంది. ఎవరి కర్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?
అధ్యక్షుడిని మార్చితే రక్తపాతం కలిగిస్తామని ఆ దేశవాసులు చెబుతున్నారు. మా అధ్యక్షుడిని మార్చబోనివ్వమని తెగేసి చెబుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం అధ్యక్షుడిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి. మన దేశంపై వారి వైఖరితో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. మన పర్యాటకాన్ని అవహేళన చేసిన వారి అంతు చూస్తామని మనవారు కూడా నిర్ణయించుకోవడం గమనార్హం.