25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Kushi movie vijay devarakonda : ఖుషి సినిమా ఆ మూడు సినిమాల మిక్సీనా?

    Date:

    Kushi movie vijay devarakonda
    Kushi movie vijay devarakonda

    Kushi movie vijay devarakonda : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన సినిమా. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సినిమా సెప్టెంబర్ 1న విడుదల అవుతోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

    విప్లవ్ (విజయ్ దేవరకొండ), ఆరాధ్య (సమంత) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు. తరువాత వీరిద్దరి కుటుంబాల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథ అని చెబుతున్నారు. ప్రేమ, రొమాన్స్, ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

    దేశముదురు, అంటే సుందరానికి, గీత గోవిందం సినిమాలను కలిపి తీసినట్లుగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. మూడు సినిమాల షేడ్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు. కాశ్మీర్ వెళ్లిన ఓ యువకుడికి ముస్లిం అమ్మాయి కనిపించడంతో ఆమెను ప్రేమించడానికి వెంటపడతాడు. చివరకు ఏం జరిగిందన్నదే షాకింగ్ అని తెలుస్తోంది. దీంతో సినిమా పాత సినిమాల కలగూర గంప అని ప్రచారం జరుగుతోంది.

    ఖుషి సినిమా కథపై ఇలాంటి విషయాలు బయటకు రావడంతో సినిమా విజయం ఎలా ఉంటుందోననే సందేహాలు వస్తున్నాయి. దీంతో ఖుషి సినిమా విజయ్ దేవరకొండ, సమంతకు బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందా? లేక డిజాస్టర్ గా మారుతుందా? అనేది తేలాల్సి ఉంది. రెగ్యులర్ గా వచ్చే కథతోనే కాకుండా పాత కథలను కలుపుకుని సినిమా తీయడం చర్చనీయాంశంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...

    Samantha : సమంత ఫోన్‌లో ‘మై లవ్’ కాంటాక్ట్: ఎవరిదంటే?

    Samantha : సమంత తన మొబైల్‌లో ‘మై లవ్’ పేరుతో ఒక కాంటాక్ట్...