41.1 C
India
Monday, May 20, 2024
More

    Chandrababu Remand Extension : రిమాండ్ పొడిగింపు సీఐడీ రిపోర్టే కారణమా..?

    Date:

    Chandrababu Remand Extension :
    స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడుని సిఐడీ సిట్ అధికారులు విచారణ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. స్కిల్ స్కామ్ ప్రాజెక్ట్ కుంభకోణంలో బాబు ప్రధాన సూత్రాదారి అని తేల్చారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకమైందని సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. స్కిల్ స్కామ్ లో రూ. 300 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందని, దీనికి కారణం బాబు అతడి అనుచరులే కారణమని తెలిపింది. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో మరో సంచలన నిజాన్ని బయటపెట్టింది. సీఐడీ. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాత్ర కూడా స్కిల్ స్కామ్ లో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.
    మరో 15 రోజులు రిమాండ్..
    తొలుత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. తరువాత రెండు రోజులపాటు రిమాండ్ గడువు పొడిగిస్తూ సీఐడీ కస్టడీకి అప్పగించింది. సీఐడీ 5 రోజులపాటు కస్టడీ అడిగితే కోర్టు రెండు రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిమాండ్ ఉండదని అనుకున్నారు. కానీ కోర్టు ఏకంగా అక్టోబర్ 5 వరకు పొడిగించింది. దీని వెనుక సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టే కారణమని సమాచారం. సీఐడీ తీరు చూస్తుంటే.. చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఒకవేళ అక్కడ సానుకూల తీర్పు వస్తే చంద్రబాబుకు ఊరటే. లేకుంటే మాత్రం ఇప్పటిలాగే ప్రతికూలత కొనసాగనుంది.
    సీమెన్ ఇండియా కంపెనీలోని ఓ వ్యక్తితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని తప్పుడు డీపీఆర్ సృష్టించి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా రూ. 371 కోట్లు చెల్లింపులు, భారీ మొత్తంలో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను మాయం చేయడంలో చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించారని వెల్లడించారు. నారా లోకేష్ పేరును కూడా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది ఏపీ సీఐడీ. మధ్యవర్తి అయిన కిలారు రాజేశ్ ద్వారా లోకేష్ కు ముడుపులు అందాయని తెలిపింది. చంద్రబాబుకు తన పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా ముడుపులు అందాయని వెల్లడించింది. స్కిల్ ప్రాజెక్టు వివరాలలో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఓకె చేశారని, సీమెన్స్ కంపెనీ రూ. 3281 కోట్లు గ్రాంట్ గా ఇస్తుందని అసత్యాలు చెప్పారని సీఐడీ పేర్కొంది. ఇక రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు కూడా ఉండడంతో త్వరలో అరెస్టు చేసి విచారిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...

    Supreme Court: సుప్రీంకోర్టులో సిఐడి కి ఎదురుదెబ్బ?…చంద్రబాబు కు ఊరట

    ఆంధ్ర ప్రదేశ్: సుప్రీం కోర్టులో సీఐడీ అధికారులకు ఎదురు దెబ్బ తగిలింది. ...

    IG Promotion List : ఐజీ ప్రమోషన్ల లిస్టులో తొలిపేరు ఆయనదే.. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకేనా?

    IG Promotion List : ‘‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర కూర్చున్నా...’’...

    NARA LOKESH: నారా లోకేష్ అరెస్ట్ తప్పదా? సీఐడీ సంచలన స్టెప్

      ఐ.ఆర్.ఆర్ స్కాం కేసులో 41 ఏ కింద నోటీసులు అందుకున్న టిడిపి...