34.3 C
India
Wednesday, May 15, 2024
More

    IG Promotion List : ఐజీ ప్రమోషన్ల లిస్టులో తొలిపేరు ఆయనదే.. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకేనా?

    Date:

    IG Promotion List
    IG Promotion List

    IG Promotion List : ‘‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర కూర్చున్నా…’’ అని మన తెలుగు నాట ఓ నానుడి. ఈ సామెతను వివిధ రంగాల్లో అమలు చేస్తుంటారు మనవాళ్లు. ముఖ్యంగా రాజకీయాల్లో బాగా అమలుచేస్తారు. అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తిగా అండదండలు అందిస్తూ వారి స్వామిభక్తిని చాటుకుంటారు. ఇక సదరు రాజకీయ నాయకులు వీరికి ఉద్యోగ లబ్ధి చేకూరుస్తుంటారు.  మన దగ్గర ఇదంతా కామన్ గా నడిచే వ్యవహారమే.

    రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. తమ అనంగులతో తాము అనుకున్న వ్యూహాలు అమలు చేస్తుంటారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు విధుల పరంగా, న్యాయబద్ధరీతిలో పరస్పర సహకారంతో మెలగవచ్చు. కానీ ఇదే దుర్వినియోగం అవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో లాలూచీ పడితేనే ప్రజాస్వామ్యానికి దెబ్బ పడుతుంది. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఇది బాగా పెరిగిపోయింది. కానీ ప్రతీది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలో వారికి బాగా తెలుసు.

    తాజాగా ఐజీ ప్రమోషన్ల లిస్టును ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో చంద్రబాబును అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసిన ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి పేరు తొలిస్థానంలో ఉండడాన్ని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు గిఫ్ట్ గా ఆయనకు ప్రమోషన్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. రఘురామరెడ్డి 2006 బ్యాచ్ కు చెందినవారు. అయితే ఈయన వైసీపీ మనిషి అంటూ టీడీపీ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ మద్దతుగా పనిచేయాలి అనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని గతంలో స్వయంగా చంద్రబాబు ఆయన మీద సీరియస్ అయిన విషయాన్ని టీడీపీ శ్రేణులు కామెంట్స్ పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో రఘురామరెడ్డి పేరు బాగా వైరల్ అయ్యింది. తాజాగా ప్రమోషన్ల లిస్ట్ తొలి పేరు ఆయనదే కావడంతో స్వామిభక్తి బాగానే పనిచేసిందని టీడీపీ మద్దతు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...