30.8 C
India
Friday, May 17, 2024
More

    TDP Mileage with Babu’s Arrest : బాబు అరెస్టుతో టీడీపీకి మైలేజ్.. ప్రతిపక్షానికి జగన్ మేలు

    Date:

    TDP Mileage with Babu's Arrest
    TDP Mileage with Babu’s Arrest
    TDP Mileage with Babu’s Arrest : టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపించడం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న విపక్ష నేతలను జగన్ రెడ్డి కొంత అడ్డుకోగలిగారు. జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు. విపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తూంటే తట్టుకోలేడు. ఎందుకంటే తన అసమర్థత బయటపడుతుందనే భయంతో. చంద్రబాబు పర్యటనతో అధికార పార్టీపై అసంతృప్తి, ఆగ్రహావేశాలు బయటపడుతుండడంతో చంద్రబాబును జైలుకు పంపించిన జగన్ నలభై రోజులుగా రాక్షసానందం పొందుతున్నాడు. అరెస్టుకు ఏ ఒక్క ఆధారం మాత్రం ఇప్పటికీ చూపించడం లేదు. అయితే జగన్ లక్ష్యం మాత్రం నెరవేరిందని ఇప్పుడు .. టీడీపీ ప్రజా సమస్యలపై పోరాడటం లేదని వైసీపీ నేతలంటున్నారు. ఇదే అసలు కుట్ర అని పేర్కొంటున్నాడు. అరెస్టుకు ముందు ఎటు చూసినా టీడీపీ కార్యక్రమాలే కనిపించాయి.
     చంద్రబాబును రాజకీయ పర్యటనలో ఉన్నప్పుడే అరెస్టు చేసింది జగన్ ప్రభుత్వం. ఎన్నికలకు ఆరేడు నెలల ముందే ఏపీలో ఎటు వైపు చూసినా టీడీపీ జెండాలు కనిపించేలా ప్రచార ప్రణాళికను బాబు ప్లాన్ చేసుకుని అమలు చేశాడు. మినీ మేనిపెస్టోను ప్రకటించి.. పార్టీ నేతలందర్నీ ఇంటింటికి పంపించాడు. అయితే ఇది ఆరంభమేనని.. ముందు ముందు అసలు ప్రచార భేరీ ఉందని చెబుతున్నారు. వచ్చే ఎనిమిది నెలల పాటు టీడీపీ క్యాడర్ అంతా.. ఓటర్లను అంటిపెట్టుకుని ఉండేలా కార్యక్రమాలను ఖరారు చేసి.. నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థనూ సెట్ చేశారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ , ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ.. . ఒక దాని తర్వాత ఒకటి కాకుండా.. ఒకటి కొనసాగుతూండాగనే మరో ప్రచార కార్యక్రమం సిద్ధం చేశారు. అన్నింటినీ జగన్ రెడ్డి నలభై రోజులుగా ఆపేయించగలిగారు. లోకేష్ పాదయాత్ర కూడా ఊహించని విధంగా సక్సెస్ అయింది. మొదట్లో పాదయాత్రలో జనాలు లేరని.. అదనీ ఇదనీ ప్రచారం చేసినా ఏమీ చేయలేకపోయారు.
    చివరికి .. పాదయాత్ర ఆపడానికి ఒక్కటే మార్గమనుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా నలభై రోజుల పాటు జైల్లో ఉంచారు. దీంతో  లోకేష్ చంద్రబాబు విషయంలో న్యాయపోరాటం కోసం పాదయాత్ర నిలిపి వేయక తప్పలేదు. ఇది కూడా వైసీపీ నేతలు సాధించిన విజయంగానే భావించవచ్చు. కానీ కానీ కాలికి అంటింది ముక్కుకు రాసుకుంటున్నాడు జగన్ . రాజకీయ కార్యక్రమాలతో వచ్చే ఇంపాక్ట్ వేరు.. అది రాజకీయంగానే ఉంటుంది. ఇలాంటి అరెస్టుల ద్వారా వచ్చే ప్రభావం వేరు. టీడీపీకి జగన్ రెడ్డి చేసిన అరెస్టు ఎంతో మేలు చేస్తున్నదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత ప్రభుత్వ వేధింపుల కారణంగా క్యాడర్, లీడర్ చాలా వరకూ స్తబ్దుగానే ఉండిపోయారు. వారందర్నీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా చివరికి వృద్ధులు సైతం రోడ్డు మీదకు వచ్చేలా జగన్ రెడ్డి చేశారని.. ఇది టీడీపీకి ఆయన చేసిన మేలు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...