Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధినేత సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిం చనున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఈ నెల 3వ తేదీన విజయనగరం 4వ తారీకున శ్రీకాకుళం 5వ తారీకున విశాఖ జిల్లాలకు ఆమె వెళ్తారు. నిజం గెలవాలి అనే పేరుతో ఇప్పటికే ఆమె పలువురిని పరామర్శిం చారు. చంద్రబాబు బయలు వచ్చిన నారా భువనేశ్వరి పర్యటనలకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల మూడో తారీకు నుంచి మళ్లీ పర్యటన మొదలుపెట్టబోతున్నారు. భువనేశ్వరి పార్టీ నేపథ్యంలో టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యా రు. భువనేశ్వరి పర్యటించే ప్రాంతాల నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.