34.1 C
India
Sunday, May 19, 2024
More

    Nara Lokesh : వైసీపీకి చిక్కని నారా లోకేశ్.. ట్రోలింగ్ కు ఛాన్స్ ఇవ్వని యువనేత..

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : రాజకీయాల్లో ఎదగడం అంటే అంత సులువు కాదు. రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడి కొడుకైనా ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటేనే నిలబడతాడు. లేకపోతే అందరిలోనూ చులకన భావన తప్పదు. ఒక నాయకుడు మాట్లాడుతున్నాడంటే ఏం చెబుతాడోనని ప్రజలు ఆగిపోవాలి. అంతేకానీ ఎలా మాట్లాడుతాడో, ఏం కామెడీ చేస్తాడో చూద్దామనుకోకూడదు. అలాంటి అవమానకర ట్రోలింగ్స్ నుంచి ఇప్పుడు అధికార పార్టీ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే నాయకుడిగా ఎదిగాడు ఓ మాజీ సీఎం కుమారుడు. అతనే నారా లోకేశ్.

    మార్పు ఎలా వచ్చింది..
    ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశాడు లోకేశ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు శ్రమించాడు. ఆయన టీంలో నారా లోకేశ్ కు సైతం మంత్రి పదవి వచ్చింది. కానీ అతనికి వాక్చాతుర్యం లేకపోవడంతో ఏం మాట్లాడినా వైసీపీ నాయకులు కామెడీగా తీసుకునేవారు. లోకేశ్ మాట తీరు అలా ఉండేది. ఈయనది స్టాఫ్ట్ మెంటాలిటీ. రాజకీయాల్లో అప్పుడప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భం.

    యువగళంతో మార్పు..
    ప్రతీ రోజు ఒకేలా ఉండదు.. ప్రతి వ్యక్తి కూడా ఒకేలా ఉండడం సాధ్యం కాలం, పరిస్థితులు, ప్రభావాలకు తగ్గట్లుగా మారక తప్పదు. పొలిటికల్ కమెడియన్ అన్న మార్క్ ను వేగంగా చెరిపేసుకున్నాడు. యువగళం పేరిట ప్రజల్లోకి వెళ్లిన లోకేశ్.. తన వేష, భాషనే కాదు.. మాటల్లోనూ తేడా చూపించారు. తన పాదయాత్రకు సీఎం జగన్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఛేదించి పరిపూర్ణ నాయకుడిగా ఎదిగాడు. తండ్రి జైలులో ఉన్న సమయంలో ఢిల్లీ నాయకులతో మంతనాలు జరిపారు. ఢిల్లీ స్థాయిలోనూ ఆయన రాజకీయ వ్యవహారాలు చక్కబెడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడు. ఒకప్పుడు చిన్నమాట తడబడితే దాన్ని ట్రోల్ చేసేందుకు వేలాది మంది ఎదురు చూసేవారు. ఇప్పడు అలాంటి అవకాశం ఇవ్వ కుండా జాగ్రత్త పడుతున్నారు. పైగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న కౌంటర్లకు ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...