YCP Rebel MLCs : ఎన్నికల వేళ అధికార వైసిపిని వీడి విపక్ష టిడిపీ,జనసేన లోకి ఫిరాయించిన శాసనమం డలి సభ్యలపై అనర్హత వేటు పడింది. తమ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలనకు పాల్పడు తన్నారంటూ వైసిపి ఇఛ్చిన ఫిర్యాదు ను పరిశీలించిన ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యి మెషన్ రాజు,సదురు రెబల్ ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్నారు.దీనిపై సంతృప్తి తెందిని ఆయన వారిపై అనర్హత వేటు వేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు.
వైసిపీ తరుపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య తో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్ ఈ మద్య పార్టీ ఫిరాయించారు. సి. రామచంద్రయ్య వైసిపీని వీడి టిడిపిలోకి ఫిరాయించగా వంశీకృష్ణ యాదన్ వైసిపి ని వీడి జనసేనలోకి ఫిరాయించారు. నేరుగా పార్టీ వేదికలపై వీరు కండువాలు కప్పుకున్నా రు. దీంతో వైసిపి వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది.