35.6 C
India
Tuesday, May 14, 2024
More

    #OG Glips: సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ‘#OG’ గ్లింప్స్.. టాలీవుడ్ లో ఇదే హయ్యెస్ట్..

    Date:

    #OG Glips: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘OG’విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న OG గ్లింప్స్ శనివారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ గ్లింప్స్ విడుదలైన కాసేపటికే యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

    కేవలం 24 గంటల్లోనే 730k లైక్స్ సాధించి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక లైక్స్ సాధించిన గ్లింప్స్ వీడియోగా నిలిచింది.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా గ్లింప్స్‌పై (720K) ఉన్న ఈ రికార్డును ‘OG’ బ్రేక్ చేసింది. ఈ మూవీ గ్లింప్స్‌కు 24 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు.

    పవన్ కళ్యాణ్ సృష్టించిన రికార్డులను బ్రేక్ చేయడం తమ అభిమాన నటుడుతోనే తప్పా మిగతా ఎవరితోనూ కాదని వారు కుండబద్దలు కొడుతున్నారు.ఇదిలాఉండగా పవన్ ఇప్పటికే మూడు నుంచి నాలుగు సినిమాలు ఒకేసారి లైన్లో పెట్టి షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.వీటిని త్వరగా కంప్లీట్ చేసుకుని రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు పవన్ చూస్తున్నారని టాక్.

    ఇటీవల సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన బ్రో మూవీ మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ మూవీ టైం వాల్యూ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కగా సాయిధరమ్ తేజ్,వపన్ కళ్యాన్ కలిసి నటించారు. మామ అల్లుళ్లు కలిసి నటించిన బ్రో మూవీకి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. కాగా, OG లో పవన్ మరోసారి గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related