36.2 C
India
Thursday, May 16, 2024
More

    PM Modi France Visit : చైనా  ఆధిపత్యానికి భారత్ చెక్

    Date:

    PM Modi France Visit
    PM Modi France Visit
    PM Modi France Visit : చైనా ఆధిపత్యానికి అడుగడుగునా బారత్ అడ్డపడుతున్నది. ఒక్కొక్కటి చెక్ పెడుతూ వస్తున్నది. భారత్ కు రష్యా తోడవుతుండడంతో చైనా అధినేతకు ఇది మింగుడు పడడం లేదు.  తాజాగా ఇప్పుడు బ్రిక్స్ వంతు వచ్చింది. భారత్ చొరవతో మరో ఆరు దేశాలు సభ్యత్వం పొందాయి. ఆ దేశాలు బ్రిక్స్ లోశాశ్వత సభ్యత్వం పొందాయి.
    వ్యతిరేకించిన చైనా
    భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చైనా, రష్యాల బ్రిక్స్ సభ్యత్వంలో కొత్త దేశాలు చేరేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి ప్రకారం, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, అర్జెంటీనా, సౌదీ అరేబియా, ఇరాన్ మొత్తం 6 దేశాలు బ్రిక్స్‌లో కొత్త శాశ్వత సభ్య దేశాలుగా మారబోతున్నాయి. వారి సభ్యత్వం జనవరి 1, 2024 నుంచి అమలులోకి రాబోతుననది. కొత్త సభ్యుల ఎన్నిక సందర్భంగా భౌగోళిక అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది. బ్రిక్స్‌లో ప్రాంతీయ సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నాలు స్పష్టమవుతున్నాయి. ఈ సంస్థను G-7కు వ్యతిరేకంగా నిలబెట్టడానికి చైనా తన మద్దతు ఉన్న దేశాలను బ్రిక్స్‌లో చేర్చాలనుకుంది. అయితే, చైనా ఎత్తులను రష్యాతో పాటు భారత్ తారుమారు చేశాయి.
    బ్రిక్స్‌లో చేరిన అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. భారత్, చైనాల మధ్య వివాదం ఉన్నప్పటికీ బ్రిక్స్ విస్తరణకు అంగీకరించాయి. గతంలో కనీసం 20 దేశాలు బ్రిక్స్‌లో చేరాలని తమ కోరికను అధికారికంగా వ్యక్తం చేశాయి. వీటిలో 4 ఆఫ్రికాకు చెందినవి. ఐదు శాశ్వత బ్రిక్స్ సభ్యులు సౌదీ అరేబియా, ఈజిప్ట్ ను చేర్చుకునేందుకు అంగీకరరించాయి. కానీ బ్రిక్స్‌లో చేరడానికి ఇండోనేషియా నిరాకరించింది.  దక్షిణాఫ్రికా యుఏఈ, ఇరాన్‌లకు మద్దతు ఇచ్చింది. చివరి క్షణంలో బ్రిక్స్‌లో చేరేందుకు ఇండోనేషియా నిరాకరించింది. ఇరాన్‌కు రష్యా బహిరంగంగా మద్దతు ఇచ్చింది.  దీనికి బ్రెజిల్ ఆమోదం కూడా లభించింది. ఈ రోజుల్లో ఇరాన్ రష్యాకు ఆయుధాలు, డ్రోన్‌లను విపరీతంగా విక్రయిస్తున్నది. అయితే, ఇరాన్‌పై పశ్చిమ దేశాల కఠినమైన ఆంక్షల కారణంగా, ఇది బ్రిక్స్‌కు సమస్యగా మారవచ్చు. మొత్తం గ్రూప్‌లో ఇరాన్‌పై చర్చ చాలా సేపు సాగింది.
    అయితే సౌదీ అరేబియా, అమెరికా మధ్య సంబంధాలు సరిగా లేవు. సౌదీ అరేబియా భారత్‌కు మిత్రదేశం. ఇప్పుడు చైనా, రష్యాలతో స్నేహం పెంచుకుంటున్నది. ఈజిప్టు వ్యూహాత్మక ప్రాముఖ్యతను చూసి, దక్షిణాఫ్రికా దానికి మద్దతు ఇచ్చింది. అంతకుముందు బుధవారం, బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా నేతలు బ్రిక్స్ గ్రూప్ విస్తరణపై చర్చలు జరిపారు.
    బ్రిక్స్ నేతలు అంగీకరించారు
     చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా, ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా, అంతర్జాతీయ న్యాయస్థానం పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని కారణంగా బ్రిక్స్ సదస్సుకు జోహన్నెస్‌బర్గ్‌కు రాలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఈ సదస్సుకు తన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రూప్ను విస్తరించాలనే ఆలోచనకు మొత్తం ఐదుగురు నేతలు మద్దతు తెలిపారు.
    బ్రిక్స్‌లో చేరేందుకు 20కి పైగా దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో ఈ సమూహం ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా కూడా చేరింది.
    బ్రిక్స్ సభ్యత్వం కోరుతున్న దేశాలలో సౌదీ అరేబియా ఒకటి.  ఇది చైనా, రష్యాలకు కొంచెం దగ్గరగా ఉండే అవకాశాలను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ విస్తరణకు మద్దతుతో  ఏకాభిప్రాయం కుదిరింది. చైనా, రష్యాల కూడా విస్తరణకు ముందుకొచ్చాయి.
    బ్రిక్స్ సభ్య దేశాల్లో తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చైనా చూస్తున్నది. ఆయా దేశాల్లో మౌలిక వసతులకు పెట్టబడులు పెడుతూ తన గుప్పిట్లో పెట్టుకొని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నది. ఇదే గ్రూప్లో సభ్యదేశమైన ఇండియా చైనా ఎత్తులకు చెక్ పెడుతున్నది. చైనా పాక్ కు రహదారిని విస్తరిస్తున్నది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే నేరుగా కుదరదు. భారత విదేశాంగ శాఖ చైనా కుయుక్తులను పసిగడుతున్నది. ఇందుకు మోదీ తన చాణక్యంతో చైనాను ఇరుకున్న పెడుతున్నాడు. అయితే బ్రిక్స్ విస్తరణ ప్లాన్  ప్రధాని మోదీదే కావడంతో జిన్ పింగ్ కక్కలేక, మింగలేకపోతున్నాడు. లోలోపల ఉడికిపోతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Arunachal Pradesh : బాలికలతో వ్యభిచారం.. అరెస్టయిన వారిలో ప్రభుత్వ అధికారులు

    Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...