34 C
India
Tuesday, May 21, 2024
More

    Polimera 2 Unexpected collections : ‘పొలిమేర 2’కు ఊహించని కలెక్షన్స్.. చిన్న సినిమాకు ఓ రేంజ్ లో రెస్పాన్స్.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు!

    Date:

    Polimera 2 Unexpected collections
    Polimera 2 Unexpected collections
    Polimera 2 Unexpected Collections : ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన కొత్త సినిమాల్లో ”పొలిమేర 2” ఒకటి.. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం విదితమే.. ఇదే కోవకు చెందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ‘మా ఊరి పొలిమేర’ సినిమా రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది.
    అప్పుడు ఇది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ”మా ఊరి పొలిమేర 2” తెరకెక్కింది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా ఫస్ట్ పార్ట్ కిక్ ఇచ్చింది. పార్ట్ 1 క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 2 లీడ్ ఇచ్చాడు డైరెక్టర్.. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ను మొన్న రిలీజ్ చేసారు.
    ఈసారి చేతబడి కాన్సెప్ట్ ను మరింత క్రూరంగా చూపించి ముందు నుండే ఆడియెన్స్ లో మంచి అంచనాలను పెంచేశారు. ఫస్ట్ పార్ట్ లో తన నటనతో అలరించిన సత్యం రాజేష్ ఇప్పుడు కూడా తన నటనలోని విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించాడు.. శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
    అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. అలాగే శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీ కృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జ్ఞానీ సంగీతం అందించారు. ఇక వరల్డ్ వైడ్ గా 3.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకు 2 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..
    ఈ సినిమాకు మంచి టాక్ రావడం పైగా కొత్త సినిమాల్లో ఇంట్రెస్టింగ్ గా మరేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 2.75 కోట్లు రాబట్టి సత్తా చాటుకుంది. ఇక ఈ రోజు ఆదివారం మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దగ్గరగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్న సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Getup Srinu wife : గెటప్ శ్రీను భార్యగా నటించిన ఈమెను గుర్తు పట్టారా? ఓ రేంజ్ లో అదరగొడుతుంది

    Getup Srinu wife : సత్యం రాజేష్ నటించిన హారర్ థ్రిల్లర్...

    Ma Uri Polimera-2 : ”మా ఊరి పొలిమేర 2” రివ్యూ అండ్ రేటింగ్!

    Ma Uri Polimera-2 :  ప్రతీ వారం బాక్సాఫీస్ బరిలో సినిమాలు...

    Polimera 2 Teaser : పొలిమేర-2 టీజర్.. చూస్తూనే వణుకు పుట్టాల్సిందే..!

    Polimera 2 Teaser : ఈ మధ్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ...