31.4 C
India
Saturday, May 18, 2024
More

    Ma Uri Polimera-2 : ”మా ఊరి పొలిమేర 2” రివ్యూ అండ్ రేటింగ్!

    Date:

    Ma Uri Polimera-2
    Ma Uri Polimera-2

    Ma Uri Polimera-2 :  ప్రతీ వారం బాక్సాఫీస్ బరిలో సినిమాలు వస్తూనే ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయి.. ముందు నుండి ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేసి థియేటర్స్ కు వెళ్లే సినిమాలు కొన్ని బోల్తా కొడితే మరికొన్ని అంచనాలను నిలబెట్టుకుని హిట్ అవుతుంటాయి.

    మరి ఈ వారం కూడా థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వచ్చాయి. వాటిల్లో మా ఊరి పొలిమేర 2 ఒకటి. ఈ మధ్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే ప్రేక్షకుల అలాంటి సినిమాలనే ఆశిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తూ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం విదితమే..

    ఈ కోవకే చెందుతుంది ఈ సినిమా కూడా.. మా ఊరి పొలిమేర సినిమా రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ”మా ఊరి పొలిమేర 2” తెరకెక్కింది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా ఫస్ట్ పార్ట్ కిక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ను ఈ రోజు రిలీజ్ చేసారు.

    పార్ట్ 1 క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 2 లీడ్ ఇచ్చాడు డైరెక్టర్.. ఈసారి చేతబడి కాన్సెప్ట్ ను మరింత క్రూరంగా చూపించినట్టు ప్రమోషనల్ కంటెంట్ తోనే రుజువు చేసారు. దీంతో ఆడియెన్స్ లో మంచి అంచనాలను పెంచేశారు. ఫస్ట్ పార్ట్ లో తన నటనతో అలరించిన సత్యం రాజేష్ ఇప్పుడు కూడా తన నటనలోని విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో.. ప్రేక్షకులకు ఎలా ఎక్కుతుందో రివ్యూ చూద్దాం..

    కథ :

    మల్లేశం అనే వ్యక్తి చేతబడులు చేస్తూ కొంత మందిని చంపి తన ఐడెంటిటీ మార్చుకుని వేరే దగ్గరికి వెళ్లి బ్రతుకుతుంటాడు.. ఈ క్రమంలోనే ఇతడికి ఒక వ్యక్తితో గుడికి సంబంధించిన వ్యవహారంలో గొడవ జరుగుతుంది. మరి ఆ వ్యక్తికి టెంపుల్ కు సంబంధం ఉంటుంది.. అది ఎలాంటి సంబంధం? మల్లేశం కు ఆ వ్యక్తికి ఎందుకు గొడవ జరుగుతుంది? అనే ఆసక్తికర విషయాలతో ఈ సినిమా కథను డైరెక్టర్ మలిచాడు.

    సాంకేతిక నిపుణుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా కథను డైరెక్టర్ అద్భుతంగా మలిచాడు.. ఒక కథను చివరి వరకు ఎంగేజ్ చేస్తూ ప్రజెంట్ చేయడంలో ఈ డైరెక్టర్ నూరు శాతం సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.. ప్రతీ క్యారెక్టర్ ను మిస్ చేయకుండా అవసరం అయినంత వాడుకుంటూ ప్రెజెంట్ చేసారు. సినిమా స్టార్ట్ అయితే 15 నిముషాల్లోనే ఇంటెన్స్ కథ లోని డెప్త్ ప్రేక్షకులకు అర్ధం అవుతుంది.

    హర్రర్ ఎలిమెంట్స్ లేకుండా ఆద్యంతం సస్పెన్స్ గా ఈ సినిమా థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ మినహా హర్రర్ అయితే పెద్దగా లేదు అనే చెప్పాలి.. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞానీ తనదైన శైలిలో మ్యూజిక్ అందించి కొంతమేర సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చాలా వరకు గ్రాండియర్ లుక్ తీసుకు వచ్చింది.

    ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సత్యం రాజేష్ అద్భుతంగా నటించి తన క్యారెక్టర్ కు న్యాయం చేసాడు. ఇప్పటి వరకు కామెడీ పాత్రలతో మెప్పించిన సత్యం రాజేష్ కు ఆ ఇమేజ్ మొత్తం పోతుంది.. కామాక్షి భాస్కర్ల కూడా అద్భుతంగా నటించింది. గెటప్ శ్రీను, బాలాదిత్య తమ పాత్రల్లో మెప్పించారు.

    ప్లస్ పాయింట్స్ :

    సత్యం రాజేష్ యాక్టింగ్
    డైరెక్షన్
    స్టోరీ, స్క్రీన్ ప్లే
    కొన్ని హర్రర్ సీన్స్

    మైనస్ పాయింట్స్ :

    కొన్ని సీన్స్ లో హర్రర్ ఎలీమెన్స్ ఎలివేట్ అవ్వకపోవడం
    ట్విస్టులు లేకపోవడం
    హర్రర్ లేకపోవడం

    చివరిగా.. హర్రర్ ను ఎక్కువుగా ఆశించకుండా వెళితే ఈ సినిమా మెప్పిస్తుంది.. సెకండ్ పార్ట్ ను అందరు ఒక్కసారి ఎంజాయ్ చేయవచ్చు..

    రేటింగ్ : 2.75/5

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related