39 C
India
Sunday, May 19, 2024
More

    Chandrababu : రాజకీయ బాహుబలి చంద్రబాబు.. అందుకే  వైజాగ్ ఆయన వెంట నడిచింది..

    Date:

    Chandrababu :
    Chandrababu 

    Chandrababu : విజనరీ లీడర్.. నవ్యాంధ్ర సృష్టికర్త, హైదరాబాద్ ను ఐటీకి అడ్డాగామార్చిన ఒక ప్రభావశీలి. రాజకీయాల్లో మరెరవరికీ సాధ్యం కాని ఆలోచనలకు ఆయనే నిజమైన వ్యక్తిత్వం. క్రమశిక్షణ కు మారుపేరు.. తెలుగు రాష్ర్టాల అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన సీనియర్ రాజకీయ నేత, టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి రాష్ర్ట అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ ను విశ్వవ్యాప్తంగా మంచి పేరుతేవడంలో ఆయన పోషించిన పాత్రే కీలకం. నేటి రాజకీయాలు.. ప్రస్తుతం ఆయనను ఈ ప్రాంతానికి దూరం చేసినా, ఆయన చేసిన మేలు ను ఎందరు మరిచిపోయినా చరిత్ర పుటల్లోంచి ఆయన పేరు తొలిగిపోదు. రాజకీయ అవసరాలు, ప్రాంత అవసరాలను బట్టి ఈరోజు రాజకీయాలు మారిపోతున్నాయి. కానీ రాజకీయ నేతగా నేటికి అవే విలువలతో ముందుకెళ్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు కావాల్సింది సంక్షేమం కాదు అభివృద్ధి, అభ్యున్నతి అని నమ్మిన ఏకైన రాజకీయ నాయకుడు ఆయన. అందుకే ఆయనకు ఆయనే సాటి. ప్రజలకు కూడా ఆయనే మేటి.  అందుకే పబ్లిక్ ఓపినియన్ ఇది..

    ఎక్కడి నారావారి పల్లె… ఎవరీ నారా చంద్రబాబు నాయుడు…. ఎవరనుకుని ఉంటారు… పాతికేళ్ల భవిష్యత్ ని…ఈ రోజు న ఊహించి, అందరి కలలకు రూపం తెచ్చి ఆచరణ లో సాకారం చేయగల దార్శనికుడు అవుతారని. ఇంకెవరన్నా అవగలరా..జీవన ప్రమాణాలు పెరిగినా ఆరోగ్యం…ఫిట్నెస్ అంతంత మాత్రమే.. నలబై ఏళ్లకే నాలుగుగంటలు పని చేస్తే అలసిపోతున్న శరీరాలు…అదీ సొంత జీవితాల కోసం. 73 ఏళ్ల శరీరం నిన్న పొద్దున హైదరాబాద్ లో జెండా పండుగ మనవడిని పక్కన నిలబెట్టుకుని నేర్పిస్తూ చేశారు. తర్వాత గద్దర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తర్వాత వైజాగ్ చేరి దాదాపు రెండు గంటలు పొడవైన జెండా కర్రని పట్టుకుని, చిరునవ్వు చెదరకుండాచుట్టూ చూస్తూ ప్రజల్ని పలకరిస్తూ నడిచారు. గమనించారా.. ఒక్క పార్టీ జెండా లేదు. చుట్టూ పార్టీ మనుషులు ఎక్కువమంది లేరు.

    ఆయన ముందు జెండా పట్టి నడిస్తే వెనుక వైజాగ్ నడిచింది.
    తరవాత వేదిక మీద నిలబడి విజన్ 2047 విడుదల చేసి దాని గురించి గంట పైన వివరించారు.. సభ లో అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చారు. ఏ కుటుంబ పెద్ద. అదీ 50 ఏళ్ల లోపు వాళ్లు ఈ స్థాయిలో కుటుంబం కోసం చేయగలరు. ఈ నాయకుడు రాష్ట్రం కోసం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేశ రాజకీయాల్లో ఎంతో మంది మహానుభావులు పుట్టి ఉండవచ్చు. నాయకులుగా ఎదిగి ఉండచ్చు. ఇలాంటి మహనాయకుడు లా ఎవరూ పనిచేయలేదు. ఊహించండి.  నాయకులందరూ ఈయన అంత స్థాయి కాకపోయినా, ఈయన్ని అనుసరించగలిగే స్థాయిలో ఉంటే దేశం ఏ స్థాయిలో నిలబడుతుందో. నాయకుడి గా దొరకడం అదృష్టం. ఆయన అభిమాని అని చెప్పుకోడం మాటల్లో చెప్పలేనంత గర్వం ఎంత చెప్పుకున్నా అంత మిగిలుండే అక్షయ చరిత్ర.  నిజమే ఆయనో రాజకీయ బాహుబలి.

    రాష్ర్ట రాజకీయాల్లో ఆయనో మేలిమి ముత్యం. భావితరాల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేస్తున్న నేటి నీచ రాజకీయ నాయకులపై ఏడు పదుల వయస్సులో కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్న ధీరుడు. ప్రాంతాల పేరిట, సామాజిక వర్గాల పేరిట రాజకీయ నాయకులు సెంటిమెంట్లను నమ్ముకుంటే ఆయన మాత్రమే అభివృద్ధి, విజన్ అంటూ తిరుగుతున్నారు. ప్రజలకు ప్రాంతాలు, కులాలు, మతాలు కాదు అభివృద్ధి అంటే తెలియజేయాలనే ఆయన ప్రయత్నం అభినందించని మేధావి ఉండడు. వ్యక్తిగత విమర్శలు ఎవరైనా చేస్తుండొచ్చు ఆయనలా ఆలోచించే నాయకుడు ఉండడు.

    రాజకీయాన్ని రాజకీయంలాగే చేస్తాడు. సంక్షేమం పేరిట ప్రజల సొమ్మును దోచి, మళ్లీ ప్రజలకు కొసరు పంచే నేటి తరం నాయకులకు అందని వ్యక్తిత్వం ఆయనది. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను అంటే నవ్వారు.. మరి హైదరాబాద్ ఐటీకి బ్రాండ్ అయ్యింది ఎవరి హయాంలో.. లక్షలు కూడా చేయని ప్రాంతాలు నేడు కోట్లు పెట్టినా దొరకని ప్రాంతాలుగా ఎదిగింది ఎవరి వల్లా.. నేడు మేం చేశాం అని లైట్ల వెలుగులు చూపిస్తున్న నేతలకు ఆయన వేసిన పునాది కారణం కాదని చెప్పగలరా.. చరిత్రకు సాక్ష్యం ఉంటుంది. దానిని ఎవరూ కాదనరు. రాజకీయ ఆరోపణలు వంద చేయొచ్చు.. కానీ కళ్ల ముందు కనిపిస్తున్న ప్రగతికి అసలు పునాది వేసిన ఇటుకే ఆయనది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...