32.6 C
India
Saturday, May 18, 2024
More

    చేతులారా ఛాన్స్ పోగొట్టుకున్న ఆర్సీబీ.. ఇక ప్లేఆఫ్ చేరడం కష్టమే..

    Date:

    rcb
    rcb

    RCB : ఐపీఎల్-2023 సెకెండ్ హాఫ్ లో జట్ల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. దీంతో స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. లక్ష్యం ఎంత పెట్టినా ప్రత్యర్థి జట్టు చిత్తు చేస్తుంది. 200 టార్గెట్ ను కూడా అవలీలగా ఛేదిస్తున్నారు. భారీగా పరుగులు చేసినా గెలుస్తామన్న నమ్మకం మాత్రం లేదు. ప్రత్యర్థి జట్టుతో ధీటుగా తలపడుతున్నాయి.

    మొహాలీలో శనివారం రాత్రి 181 పరుగుల టార్గెట్‌ ను ఢిల్లీ కేపిటల్స్ ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్, బెంగళూర్ పెట్టిన టార్గెట్ కు ఇంకా 20 బంతులు ఉండగానే గెలిచింది. ఈ ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మన్లు బాగా రాణించారు. స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇక చేసేదేం లేక ఇరు జట్ల బౌలర్లు బిత్తరపోయారు. కౌంటర్ అటాక్‌ చేస్తూ చుక్కులు చూపించారు.

    ప్లేఆఫ్స్ సమీపిస్తుండగా జట్ల మధ్య ఫైట్ మరింత హోరాహోరీగా మారుతుంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న తపన జట్టులో కనిపిస్తుంది. ప్లేఆఫ్స్ రేసులో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేనని తలపడుతున్నాయి. శనివారం ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్‌లో ప్రధానంగా ఇదే కనిపించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానం వరకు వెళ్లిన వార్నర్ సేన బాగా తెగించి ఫియర్‌లెస్ క్రికెట్ ఆడింది. కొద్దోగొప్పో పాయింట్లను పెంచుకోగలిగింది.

    ఎంత హోరాహోరీగా తలపడినా రెండు జట్లు ప్లే ఆఫ్ చేరుకునేలా కనిపించడం లేదు. ఢిల్లీ క్యాపిటల్ ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లు ఆడగా 6 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఆ జట్టకు ప్రస్తుతం 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక జట్టు 9వ స్థానంలో కొనసాగుతున్నా, ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక ఈ 4 మ్యాచ్ లలో విజయం సాధించినా ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం మాత్రం లేదు. ఢిల్లీ క్యాపిట్ తన తర్వాతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. 10వ తేదీ రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్ తలపడుతుంది.

    ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే చాన్స్ పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ముందు 54 శాతంగా ఉన్న ఛాన్స్, మ్యాచ్ తర్వాత 34కు పడిపోయింది. ఇక బెంగళూర్ కూడా తన తర్వాతి మ్యాచ్ లు అన్నీ గెలిస్తే తప్ప ప్లేఆఫ్స్ కు వెళ్లేలా లేదు. ఇక తర్వాత జరిగే మ్యాచ్ లలో ఏ ఒక్క టీంతో ఓడినా బెంగళూర్ ఆశలు మరింత దిగజారిపోతాయి.

    ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ కు చేరే అవకాశాలు లేవు. పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి దిగజారింది ఆరెంజ్ ఆర్మీ. ప్లేఆఫ్ ఛాన్సులు 4 శాతం మాత్రమే. ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాలి. ఇందులో కూడా భారీ తేడాతో ప్రత్యర్థిని ఓడించి తన రన్‌రేట్‌‌ను భారీగా మెరుగుపర్చుకుంటే తప్ప హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరలేదు.

    ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్న జట్లలో గుజరాత్ టైటన్స్ టాప్‌లో ఉంది. ఈ జట్టుకు 91 శాతం ఛాన్స్ ఉంది. 78 శాతంతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. 58 శాతంతో లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానం, రాజస్థాన్ రాయల్స్ 42, ముంబై ఇండియన్స్ 36, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 34, పంజాబ్ కింగ్స్ 31, కోల్‌కతా నైట్ రైడర్స్ 12, ఢిల్లీ కేపిటల్స్ 12, సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 4 శాతంతో ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...