
Gambia Beaches : ఆఫ్రికాలోని చిన్న దేశమైన గాంబియాలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అందులో నిరుద్యోగం, ఆకలి, నిధుల లేమి ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు గత కొంత కాలంగా మరో సమస్య కూడా వారిని తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడి యువకుల కోసం ప్రాశ్చాత్య దేశాల నుంచి నడి వయస్కులు రావడం అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది.
అసలు కథ..
ఆఫ్రికాలోని గాంబియా పేద దేశం. ఇక్కడి వారికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. ఇక్కడి బీచ్ లో సుందర ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో సేద తీరేందుకు ఐరోపా నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వీరిలో ఒంటరి మహిళలు.. విడాకులు తీసుకొని ఒంటరిగా జీవితం గడుపుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారట. ఇలా వచ్చిన వారికి స్థానిక యువకులు సాయం చేస్తుంటారు. వారి మధ్య పరిచయం సాన్నిహిత్యానికి దారి తీసి అది కాస్తా సహజీవనంగా మారుతోంది.
పేద దేశం కావడంతో ఉపాధి కష్టమే. దీంతో ఆ దేశ యువత ఎక్కువగా పర్యాటక రంగంలో గైడ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సంపన్న దేశాలైన ఐరోపా లాంటి దేశాల నుంచి పర్యాటకులుగా వచ్చే మధ్య వయసు మహిళలతో స్నేహంగా మెలగడంతో అది కాస్తా ప్రేమగా మారి.. వారితో పాటే ఇక్కడి యువత ఆయా దేశాలకు వెళ్తున్నారు. ఐరోపాలో స్థిరపడాలన్నది ఆఫ్రికా యువత కల. అక్కడి నుంచి వచ్చిన మహిళలతో స్నేహంతో ఆయా దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఇటీవలే 32 సంవత్సరాల యువకుడు 65 ఏళ్ల మహిళను వివాహం చేసుకోవడం గమనార్హం.
సర్కారు సీరియస్
నడి వయస్కుల వారు తమ దేశ యువతను తీసుకెళ్లడం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో నియంత్రణ విధించడంతో పాటు తమ యువతకు నైతిక విలువలు నేర్పాలని ఆ దేశ సర్కారు నిర్ణయించింది. ఈ కార్యాచరణతో కొన్నాళ్లలో యువతలో మార్పు వస్తుందని ఆశిస్తోంది.