34.3 C
India
Wednesday, May 15, 2024
More

    Sajjala Crisis In YCP : వైసీపీలో ‘సజ్జల’ సంక్షోభం..!

    Date:

    Sajjala Crisis In YCP
    Sajjala Crisis In YCP

    Sajjala Crisis In YCP : ఏపీ అధికార పార్టీ వైసీపీలో సోషల్ మీడియా సంక్షోభం ముదరింది.  ఏపీ సీఎం జగన్ కు  సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. తండ్రి రామకృష్ణా రెడ్డి జగన్ కు ముఖ్య సలహాదారులుగా ఉంటూ  షాడో సీఎంగా  అధికారం చెలాయిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఆయన కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాను కార్యకర్తలకు నరకం చూపెడతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  డబ్బులిప్పించండి అంటూ అని వైసీపీ ఫాలోవర్  శ్రీరెడ్డిని బతిమాలుకుంటున్నారు

    వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా పెయిడ్ ప్రమోషన్ల మీద కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్లో స్వచ్ఛందంగా పోస్టులు షేర్ చేసే వారు ఐదు శాతం కూడా ఉండదు. మిగతా 95 శాతం మంది పేమెంట్‌ బ్యాచ్.  ఇందు కోసం ఓ యాప్ ఉంది. అయితే ఈ పేమెంట్ కాకుండా… కాస్త ఫాలోయర్లు.. ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికి ప్రత్యేక ఖాతాలు ఉంటాయి. అలాంటి వారికి కూడా డబ్బులు చెల్లించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంటెంట్ వైసీపీ కార్యాలయం నుంచి వస్తే… వీళ్లు పోస్ట్ చేస్తారు. శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

    ఆర్జీవీ పేమెంట్స్ గురించి బయటపడలేదు కానీ… శ్రీరెడ్డి మాత్రం ఓపెన్ అయ్యారు. డబ్బులివ్వండి జగనన్న అని.. శ్రీరెడ్డి పోస్టు పెట్టిన తర్వాత కొన్ని వందల మంది ఆమెకు మద్దతు తెలుపుతూ పర్సనల్ గా మెసెజ్ లు కూడా చేశారు. ఇదే విషయాన్ని శ్రీరెడ్డి కూడా ట్విట్టర్ లో ప్రకటించారు. తర్వాత సజ్జల భార్గవ నుంచి ఏమైనా హామీ వచ్చిందో..లేకపోతే డబ్బులు ఇచ్చారో కానీ.. ఆ పోస్టుల్ని తీసేశారు. మళ్లీ బూతు పోస్టులు పెట్టారు. అంటే బెదిరిస్తే తప్ప చేసిన పనికి డబ్బులు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    సజ్జల భార్గవరెడ్డి తండ్రిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా ఇంచార్జ్ పోస్టులోకి వచ్చారే తప్ప ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని.. పండిత పుత్ర పరమశుంఠ టైపులో .. సజ్జల సీఎంను గుప్పిట్లో పెట్టుకుంటే ఆయన కుమారుడిని ఇతరులు గుప్పిట పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా ఇన్చార్జిగా పని చేస్తూంటాడు. సజ్జల భార్గవకు ఇమేజ్ పెంచుతున్నట్లుగా కొన్ని ఫొటోలు లీక్ చేయడం ఆయన పని. ఇది చాలనుకుని సజ్జల భార్గవ ఊరుకుంటాడు. కానీ అక్కడ సోషల్ మీడియా పరువు రోడ్డున పడిందనే విషయం వాళ్లకు అర్థమైనా కానట్లే ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  చేసుకోలేకపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...