28.5 C
India
Sunday, May 19, 2024
More

    Salaar Trailer 2 : యాక్షన్ ప్యాక్డ్ గా ‘సలార్ రిలీజ్ ట్రైలర్..’

    Date:

    Salaar Trailer 2
    Salaar Trailer 2

    Salaar Trailer 2 : పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ ఈ నెల 22న క్రిస్మస్ కానుకగా థియేటికల్ రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతుంటే మూవీ టీమ్ సర్ ప్రైజ్ లపై సర్ ప్రైజ్ లను ఇస్తూ వెళ్తోంది. ఇందులో భాగంగా ‘రిలీజ్ డేట్ ట్రైలర్’ నేడు (డిసెంబర్ 18) రిలీజ్ చేశారు.

    స్నేహం, అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ సాగుతుంది. శత్రువులైన ఇద్దరు స్నేహితుల కథతో ‘సలార్’ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మొదటి పార్ట్ ను ‘సలార్: సీజ్ ఫైర్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్, డైరెక్టర్ టీనూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్ యూనివర్స్ లోనే సలార్ వస్తుందనే రూమర్స్ పై ప్రశాంత్ నీల్ స్పందించారు. అయితే రెండింటికీ సంబంధం ఉందని చెప్తున్నారు.

    సలార్ పై రీసెంట్ ట్రైలర్ రిలీజ్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లో ఛత్రపతి తర్వాత అంతే క్రేజ్ తీసుకస్తుందని టాక్ మొదలైంది. ట్రైలర్ పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఈ మూవీనే భారీ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే ఓవర్సీస్ లో రికార్డులకు మించి టికెట్లు అమ్ముడు పోయాయి.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related