38 C
India
Wednesday, May 15, 2024
More

    Martin Luther King Review : సంపూర్ణేష్ బాబు ”మార్టిన్ లూథర్ కింగ్” ఎలా ఉంది.. రివ్యూ ఇదే!

    Date:

    Martin Luther King review
    Martin Luther King review

    Martin Luther King Review : సంపూర్ణేష్ బాబు గురించి అందరికి తెలుసు. ఈయన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాలు చేసాడు.. ఈయన సినిమాలకు ఎన్ని విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేసాడు. ఇక లాజిక్స్ లేకుండా ప్రేక్షకులు కూడా ఈయన సినిమాలను బాగానే ఎంజాయ్ చేసారు.

    మరి అలాంటి సంపూర్ణేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత మరో క్రేజీ మూవీతో వస్తున్నారు.. ఆ సినిమానే ”మార్టిన్ లూథర్ కింగ్”.. ఈ సినిమాను నూతన దర్శకురాలు పూజ కొల్లూరు డైరెక్ట్ చేయగా వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. ఇందులో సీనియర్ నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ముఖ్య పాత్రలను పోషించగా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం..

    కథ : 

    ఒక పల్లెటూరులో రెండు కులాలు ఉంటాయి. ఈ రెండు కులాల వారి మధ్య ఎప్పుడు గొడవలు జారుతూనే ఉంటాయి.. మరి ఈ గొడవలను ఆ ఊరి పెద్దాయన సర్పంచ్ తీరుస్తుంటాడు.. ఇద్దరు కులాల నుండి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుంటాడు.. ఈ సర్పంచ్ పెద్ద భార్యకి జగ్గీ (నరేష్), చిన్న భార్యకి లోకి (వెంకటేష్ మహా) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.. వీరి గొడవలకు ఊరు బలవుతుంది..

    వీళ్ళ గొడవల వల్ల ఊరిలో ఉన్న స్కూల్, మరుగుదొడ్లు, రోడ్డు వంటివి ధ్వంసం చేస్తూ ఉంటారు.. ఇదే ఊర్లో అనాథ అయిన ఎడ్డోడు (సంపూర్ణేష్ బాబు) తనతో పాటు ఉండే చిన్నోడితో చెప్పులు కుంటుకుంటూ జీవనం సాగించేవాడు.. అప్పుడే వసంత (శరణ్య) ఆ ఊర్లో కొత్తగా పోస్టాఫీసులో ఉద్యోగం కోసం వస్తుంది.. సంపూర్ణేష్ డబ్బులు దాచుకోవడానికి అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళితే వసంత ఇతడికి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరును పెడుతుంది.

    ఇతడికి ఓటు కూడా వచ్చేలాగా చేస్తుంది.. ఇక ఇదే సమయంలో ఊరిలో ఎలెక్షన్స్ జరుగగా పెద్దాయన ఇద్దరు కొడుకులు సర్పంచ్ బరిలోకి దిగగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తాయి. అప్పుడు కొత్తగా ఓటు వచ్చిన మార్టిన్ లూథర్ ఓటు కీలకంగా మారుతుంది.. మరి అతడి ఓటు కోసం అతడిని కాకా పడుతూ నచ్చినవన్నీ ఇస్తుంటారు.. మరి తన ఓటును చివరికి ఎవరికీ వేసాడు అనేది మిగిలిన కథ..

    విశ్లేషణ : 

    ఎన్నికలపై సెటైర్స్ వేస్తూ సినిమాలు ఇప్పటి వరకు చాలానే వచ్చాయి.. అయితే విలేజ్ పాలిటిక్స్ లో జరిగే పాలిటిక్స్ ను ఈ సినిమాలో కామెడీ వేలో చూపించే ప్రయత్నం చేసారు. ఒకే ఒక్క ఓటు కోసం రాజకీయ నాయకులు ఎన్ని తిప్పలు పడ్డారు అనే విషయాన్నీ చూపించారు.. ఇది తమిళ్ లో వచ్చిన మండేలా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.. ఇక ఇప్పుడు తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ గా రీమేక్ చేసారు.. మన రాజకీయ పరిస్థితులకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా మొత్తం రెండు వర్గాల మధ్య సాగుతుంది.. తమ స్వార్ధ రాజకీయాల కోసం ఊరిని ధ్వంసం చేయడం చూపించారు. వీరి రాజకీయాల వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెరపై బాగా ఆవిష్కరించారు..

    నటీనటులు : 

    సంపూర్ణేష్ బాబు తన పాత్రకు బాగా సూట్ అయ్యాడు.. తన అమాయకమైన నటనతో ఆకట్టుకున్నాడు.. గత సినిమాల్లో బాగా లౌడ్ గా చుసిన సంపూర్ణేష్ ను ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్డ్ గా చూడవచ్చు. తన నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ ను ఈ సినిమాలో చూపించేసాడు. తినతో పాటు నరేష్, వెంకటేష్ మహా కూడా నటనలో ఇరగ దీసారు.. చిన్నోడు పాత్రలో చేసిన అతడు కూడా తన నటితో ఆకట్టుకున్నాడు. ఇక శరణ్య కూడా బాగా చేసింది.

    టెక్నీషియన్స్ : 

    తొలి సినిమా అయినా కూడా పూజ కొల్లూరు డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకుంది.. కాకపోతే కామెడీ, ఎమోషనల్ సీన్స్ పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటేబాగుండేది.. సాన్దీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.. దర్శకురాలే ఎడిటర్ కూడా కావడం విశేషం.. అయితే ఈమె మరికొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది.

    చివరిగా.. మార్టిన్ లూథర్ కింగ్ ఆడియెన్స్ ను కొంత వరకు మెప్పిస్తాడు అనే చెప్పాలి..

    రేటింగ్ : 2/5

    Share post:

    More like this
    Related

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related