
Sarojini Naidu : భారత నైటింగేల్‌గా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహిళ సరో జినీ నాయుడు ఆమె జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలను ఒక్కసారి నెమరు వేసు కుందాo. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకు న్నారు.
హైదరాబాద్‌లోని నాం పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తన తల్లిదండ్రుల తో నివాసముండేది. ఆమె జ్ఞాపకార్ధం ఈ బంగళా కు ఆమె ప్రసిద్ధ కవితా సంకలనం ‘గోల్డెన్ థ్రోషోల్డ్’ పేరు పెట్టారు. గాంధీజీ చేత భారత కోకిలగా పిలిపించుకున్న సరోజినీ నాయుడు.. మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచారు.
కోల్‌కతాకు చెందిన అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరి దేవి దంపతులకు 1879 ఫిబ్రవరి 13 న హైదరాబాద్ నగరంలో సరోజినీ జన్మిం చారు. తండ్రి నిజాం కళాశాల తొలి ప్రధానోపా ధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదా సుందరి దేవి రచయిత్రి. తల్లిదండ్రులు విద్యాధికులు కావడంతో సరోజినిపై వారి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇంగ్లిష్‌పై ఉన్న అభిమానంతో ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో చేరింది. 12 వ ఏటనే మద్రాస్ విశ్వవిద్యా లయంలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తిచేసింది.
అనంతరం లండన్ కింగ్స్ కాలేజీలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. తల్లి నుంచి కవయిత్రి లక్షణాలను ఒంటపట్టించుకున్న సరోజినీ.. బర్డ్ ఆఫ్ టైమ్, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్ వంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు చేశారు. ఈమె రచనలను ఇంగ్లండ్‌లోని ఆంగ్ల భాషా విమర్శకులు కూడా మెచ్చుకునేవారు.