Supreme Court : గృహిణిల సేవల వెలకట్టలేనివి.. వారి సేవలను ఆర్థిక కోణంలో చూడకూడదంటూ ఓ కేసు విషయంలో సుప్రీం కోర్టు మానవీయ కోణంలో వ్యాఖ్య లు చేసింది. భారతీయ సంప్రదాయాల్లో మహిళ లకు ఇస్తోన్న గౌరవప్రదమైన స్థానాన్ని గుర్తు చేసిం ది. ఓ ప్రమాద ఘటనలో పరిహారం విషయలో తీ ర్పును వెలువరిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2006లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో ఆ వాహన యజమాని ఆమెకు పరి హారం చెల్లించాల్సి వచ్చింది.
ఈ కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ మృతురాలి కుటుంబానికి (భర్త, ఆమె మైనర్ కుమారుడు) రూ. 2.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అ యితే అది తక్కువ మొత్తమని, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ బాధిత కుటుంబం ఉత్త రాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది.
ఆ పిటిషన్‌ను పరిశీలించిన ఉత్తరాఖండ్ హైకోర్టు 2017లో దానని కొట్టివేసింది. అందుకు గల కార ణాలను తెలుపుతూ.. మరణించిన మహిళ గృహి ణి కనుక ఆమె ఆదాయం పరిమితంగా ఉంటుం దని, అంచేత ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం కూడా పరిమితంగానే చూడాలని, కనీస ఆదాయాన్ని పరి గణనలోకి తీసుకుని పరిహారం చెల్లించడం సరైన నిర్ణయమేనని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును తప్పుబట్టింది: దీంతో బాధిత కుటుంబం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సు ప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఈ కేసును విచారిం చిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ సంద ర్భంగా ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబ ట్టింది.
గృహిణి సేవలను తక్కువగా అంచనా వేయడం సరికాదని, ఇంట్లో నిర్విరామంగా పని చేస్తూ తన జీవితాన్ని ఇంటికోసం కేటాయించే ఆమె సేవలను ఆర్థిక కోణంలో చూడకూడదని, ఇంట్లో సంపాదించే వ్యక్తితో పోల్చితే ఆమె ఏమీ తక్కువ కాదని వ్యా ఖ్యా మనించింది. గృహిణి ఆదాయాన్ని దినసరి కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని సూటి గా ప్రశ్నించింది. ఆమె సేవలను వెలకట్టలే మనడం లో సందేహం లేదని తెలిపింది. బాధిత కుటుం బా నికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోపు ఇవ్వాలని ఆదేశిస్తూ సంచలన తీర్పు వెలువ రిం చింది.