
Inaya love : బిగ్ బాస్ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. సినీమాలో అవకాశాలు లేని వారిని కూడా ఈ షో బాగా ఆదుకుందనే చెప్పాలి. ఇనయా సుల్తానాతో పాటు బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ సంపాదించుకొని హీరోగా మారాడు సయ్యద్ సోహెల్ ర్యాన్. సీజన్ 4లో తనదైన ఆటతీరుతో వీక్షకులను మెప్పించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్ 6లోకి అడుగుపెట్టిన బ్యూటిఫుల్ గర్ల్ ఇనయా సుల్తానా ఈమె కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా సోహైల్ కోసం ఇనయా చేసిన పని తీవ్ర దుమారానికి కారణమైంది.
డాన్స్ విత్ ఆర్జీవీ: 4 సెప్టెంబర్, 2022 రోజున ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6లోకి 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా హౌజ్ లోకి వెళ్లారు ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యా గ్రౌండ్ లేని ఆమెకు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ద్వారా ఫేమ్ వచ్చింది. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో కలిసి ఆమె డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎవరీ అమ్మాయి ఇంత గొప్ప డైరెక్టర్ తో డ్యాన్స్ చేయడం ఏంటని విపరీతమైన కామెంట్స్ పడ్డాయి.
ఆర్జీవీతో డ్యాన్స్ చేయడానికి ముందే ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. ‘ఏవమ్ జగత్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా సునీల్ నటించిన ‘బుజ్జీ ఇలా రా’, ‘నట రత్నాలు’, ‘యద్భావం తద్భవతి’ వంటి సినిమాల్లో నటించింది. అవేవి ఆమెకు గుర్తింపు తేలేదు. ఈ సినిమాల తర్వాతే ఆమె ఆర్జీవీతో డ్యాన్స్ చేసి బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసింది.
బిగ్ బాస్ 6 లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఇనయా వ్యూవర్స్ మనసు దోచుకుంది. కానీ 14వ వారం ఎలిమినేట్ అయ్యింది ఆమె. అయితే హౌజ్ లో ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపించిన ఈ భామ బయటకొచ్చిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ సయ్యద్ సోహైల్ కు ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇవన్నీ పక్కన పెడితే అటు సోహైల్, ఇటు ఇనయా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఓటీటీలోకి క్రాంతి సినిమాతో ముందుకు వచ్చింది ఈ అమ్మడు. మరోవైపు సోహైల్ ‘లక్కీ లక్ష్మణ్’, ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. ఇప్పుడు తాజాగా ‘బూట్‌కట్ బాలరాజు’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తలిసింది.
‘బూట్‌కట్ బాలరాజు’ సినిమాలోని ‘బాలరాజు.. రాజు బంగారి రాజు’ సాంగ్ ఇటీవల విడుదలై ట్రెండింగ్ లో ఉంది. రీల్స్ లో ఈ పాట ఇప్పుడు ఫేమ్ గా మారింది. ఈ పాటలో కనిపించిన బ్యూటిఫుల్ గర్ల్ ఎవరో కాదు ఇనయా సుల్తానానే. బ్లూ జాకెట్, బ్లాక్ సారీతో సిగ్గు పడుతూ స్టెప్పు లేసింది భామ. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సోహైల్ కోసమే ఇనయా వచ్చిందా.. ఏంట్రా ఈ ఖర్మ మళ్లీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది. ఇదే డ్యాన్స్ బీబీ జోడీలో చేసుంటే విన్నర్ అయ్యే దానివి అంటూ
కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోతో ఆమె లవ్ ట్రాక్ గురించి చర్చించుకుంటున్నారు.
View this post on Instagram