
Phone Check : మనలో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్లు చూస్తుంటారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిత్యం ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో పలు రకాల ఇబ్బందులు వస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఉదయం లేవగానే ఫోన్ చేతిలో పట్టుకుని చూడటం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి.
మొబైల్ ఇంటర్నెట్ ఆన్ చేయగానే టపీ టపీమంటూ వచ్చే నోటిఫికేషన్లు, సోషల్ మీడియాలో అప్ డేట్లు, ఈ మెయిల్స్, యాడ్స్ మనపై ఒత్తిడి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కళ్లపై ప్రభావం పడుతుంది. కళ్లు తెరవగానే ఫోన్ చూడకుండా చిన్న చిన్న పనులు చేసుకుని మెల్లగా ఫోన్ చూడాలి. కానీ లేస్తేనే ఫోన్ పట్టుకోవడం అంత మంచిది కాదని తెలుసుకోవాలి.
మొబైల్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నా ఎవరు కూడా లెక్కచేయడం లేదు. మానసిక ఒత్తిడి దూరం చేసుకోవాలంటే మనం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ మొబైల్ వాడకం మనకు ఇబ్బందులు తీసుకొస్తుంది. ఉదయం పూట మనం చేసుకునే పనులు పూర్తి చేసుకున్నాకనే మొబైల్ చూడటం అలవాటు చేసుకుంటే మంచిది.
ఫోన్ నిరంతరం చూడటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయని కొన్ని సంఘటనలు కూడా రుజువు చేశాయి. మొబైల్ వాడకాన్ని కూడా వీలైనంత వరకు తగ్గించుకోవడం వల్ల మనకు మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో మొబైల్ వాడకం అవసరమైతే తప్ప చేయకూడదు. ఏదో టైంపాస్ కు ఫోన్లకు ఆకర్షితులు కావడం గమనార్హం. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ కావడం ఆందోళన కలిగిస్తోంది.