Lost your Phone : మొబైల్ ఫోన్ పోయినవారు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగా ల్సిన పనిలేదు. ఇకమీదట ఇంటి నుంచి ఫిర్యాదు చేసే సౌకర్యం ఇప్పుడు అందుబా టులో ఉంది. ఇతర నెంబర్ నుంచి వాట్సాప్ లో 9440 627 057 అనే నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి. వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది.
గూగుల్ పేజీ పై క్లిక్ చేసి పోయిన మొబైల్ ఫోన్ IMEI నంబర్, తదితర వివరాలను ఎంటర్ చేయా లి. ఇలా చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు వెళ్లి నిఘా షురూ అవుతుంది. మీ ఫోన్ ఎక్కడుం దో తెలుసుకొని పోలీసులు స్వాధీనం చేసుకుం టారు.
సాధారణంగా ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కంగా రుపడి పోలీస్ స్టేషన్ల చుట్టూ అందరూ తిరుగు తుంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబా టులో ఉంది కాబట్టి ఎవరు కూడా స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్లైన్లో పైన చెప్పిన విధంగా చేస్తే మీ ఫిర్యాదు పోలీసులకు చేరుతుంది.