‘Software’ murders..కర్ణాకటలోని బెంగళూరులో ఓ జంట హత్యలు కలకలం రేపాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలో జరిగిన ఈ ఘటనలో ఓ మాజీ ఉద్యోగానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే మీడియా దీనిని హైలెట్ చేయకుండా వదిలేసింది. అయితే ఇక్కడ ఇతర పార్టీలు ఏవైనా ఉంటే శాంతిభద్రతల కోణంలో మీడియాలో హడావుడి ఉండేది. కానీ అదేమీ చేయలేదు. డీసీ కాలమ్ వార్తతో అంతా మమా అనిపించారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలి తర్వాత కర్ణాటకలో సిలికాన్ సిటీ కి కూడా అంతే పేరు సంపాదించింది. సాఫ్ట్ వేర్ సిటీగా పేరొందింది. ఇక్కడే ఈ హత్యలు జరిగాయి. అమృతహండి పంపా లే అవుట్ లో ఈ ఘోరం జరిగింది. ఏరోమిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, సీఈవో వినూకుమార్ మీద మాజీ ఉద్యోగి జోకర్ ఫిలిప్స్ కత్తితో పొడిచాడు. విచ్చలవిడిగా పొడవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే వీరి వద్దే పనిచేసిన జోకర్ ఫిలిప్స్ కొంత కాలం క్రితం మానేశాడు. సొంతంగా బిజినెస్ మొదలుపెట్టాడు. అయితే తన వ్యాపారానికి ఫణీంద్ర, వినూ కుమార్ అడ్డు తగులుతున్నారని అనుమానించాడు. దీంతో ఆఫీస్ కు వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొపొద్రిక్తుడైన జోకర్ ఫిలిప్స్ వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో వారిని విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వార్త పై కన్నడ మీడియా లో ప్రాధాన్యం కనిపించలేదు. అయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే శాంతిభద్రతల కోణంలో వార్తలు వడ్డించేవారని అంతా చర్చ మొదలైంది.
కరోనా విపత్తు తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసేశాయి. ఈ క్రమంలో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరికొన్ని కంపెనీలు లే ఆఫ్ కూడా ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో, ఉద్యోగుల్లో వణుకు పుట్టించేలా ఈ ఘటన జరగడం కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉండే ఉద్యోగులు, యాజమాన్యాలు మరింత భయాందోళనకు గురయ్యాయి. ఒక్కసారిగా సాఫ్ట్ వేర్ రంగాన్ని ఈ హత్యలు ఊపేశాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగులను తీసేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆయా కంపెనీల ఉన్నతోద్యోగులు భయపడుతున్నారు.