Sreeleela :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఇది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించింది. దీనికి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక పుష్ప1లో సినిమా అంతా ఒక ఎత్తయితే సమంత చేసిన ఐటం సాంగ్ ఎత్తు. ‘ఊ అంటవా.. మావ.. ఊహూ అంటావా మావ’ అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది.
ఇక పుష్ప2లో కూడా ఇంతకు మించి ఐటం సాంగ్ ఉండాలని సుకుమార్ భావిస్తున్నారట. అయితే అప్పుడు సమంత ఇచ్చిన పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే గ్లామర్ డాల్ కావాలని ఎదురుచూస్తున్నారట. దీని కోసం ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నారట. దీని కోసం పవన్ కళ్యాణ్ గర్ల్ ఉర్వశీ రౌతేలాను కూడా ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో నిజం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరో హీరోయిన్ గురించి కూడా పుకార్లు శికార్లు చేస్తున్నాయి అదే శ్రీలీల.
అవును.. మీరు విన్నది నిజమే. రాఘవేందర్ రావు పెళ్లి సందడిలో అమ్మడి డ్యాన్స్ కు సుకుమార్ ఫిదా అయ్యారట. ఈమెను బన్నీతో చిందేపిస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావించి సంప్రదించారట. బన్నీతో సాంగ్ అంటే ఎగిరిగంతేశారని టాక్ నడుస్తోంది. ఇది నిజం కాదని శ్రీలీల అభిమానులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఆమె.. ఐటెం సాంగ్ చేస్తుందా.. ? ఇదంతా ఫేక్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ReplyForward
|