35.8 C
India
Monday, May 20, 2024
More

    Star Heroine Manager : యాటిట్యూడ్ చూపుతున్న స్టార్ హీరోయిన్ మేనేజర్.. ఎక్కువ రోజులు కొనసాగడంటూ కామెంట్లు..

    Date:

    Star Heroine Manager
    Star Heroine Manager
    Star Heroine Manager : హీరోయిన్లు మేనేజర్ విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. తాము సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండడంతో తమకు కాల్షీట్లు, డేట్స్ అన్నీ మేనేజర్ల చేతితో ఉంటాయి. దీంతో కొందరు మేనేజర్లు యాటిట్యూడ్ చూపుతూ ఇండస్ట్రీలో సదరు హీరోయిన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంటారు. అలాంటి ఒక హీరోయిన్ మేనేజర్ ప్రస్తుతం చుక్కలు చూపుతున్నారట ఇంతకీ ఏం చేస్తున్నాడంటే.
    ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేస్తూ మెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఫేమస్ అయి మెల్లమెల్లగా టైర్-3, ఆ తర్వాత టైర్-2 హీరోలు, హీరోయిన్ల డేట్స్ మేనేజ్ చేయడం మొదలుపెట్టాడు సదరు మేనేజర్. ఆ తర్వాత సౌత్ ఇండియాలోని దాదాపు అన్ని పట్టణాల్లో బ్లాక్ బస్టర్స్ కొట్టిన స్టార్ హీరోయిన్ కు మేనేజర్ అయ్యాడు. కానీ అప్పట్లో ఆమె అతన్ని ఎలిమినేట్ చేసింది. దీంతో సదరు వ్యక్తి మరో స్టార్ హీరోయిన్ డేట్స్ మేనేజ్ చేస్తున్నాడు. అతని వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారింది.
    ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు చాలా బిజీగాఉన్నారు. ఆమెతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు డేట్స్ సరిగ్గా కేటాయించకపోవడం, ఆమె గురించి ఆరా తీస్తే సదరు మేనేజర్ సరిగా స్పందించకపోవడం నిర్మాతలు, దర్శకులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. రీసెంట్ గా ఓ టాప్ ప్రొడ్యూసర్ ఓ సినిమా ప్రమోషన్స్ కోసం సదరు హీరోయిన్ డేట్స్ అడుగగా అతనికి చుక్కలు చూపించాడు మేనేజర్. ఈ తరహా యాటిట్యూడ్ ఆయనను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబెట్టదని, త్వరలోనే ఈ యంగ్ స్టార్ హీరోయిన్ కూడా ఆయనను ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
    అంతేకాదు, గతంలో ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి సినిమాలు చేయించుకున్న దర్శకులు, నిర్మాతలకు సదరు మేనేజర్ దూరంగా ఉంచుతున్నారు. ఆ హీరోయిన్ తో ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు చేయిస్తూ సినిమా అవకాశాలను తగ్గిస్తూ వస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.  ఇండస్ట్రీలో కొందరు మేనేజర్లు దాదాపు రెండు మూడు దశాబ్ధాల పాలు స్టార్ హీరోయిన్ల డేట్స్ మేనేజ్ చేశారంటే అందుకు కారణం వారి చిత్తశుద్ధి, వినయపూర్వక వైఖరి. ఈ మేనేజర్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగేందుకు తన వైఖరిని మార్చుకోవాలని చాలా మంది సూచనలు ఇస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related