Convocation చదువులో ఒత్తిడి.. క్యాంపస్ లైఫ్ అంతా ముగిసిన తర్వాత ఎవరికైనా ఎంతో కొంత ఎంజాయ్‌మెంట్ ఉంటుంది ఇది కామన్. ప్రతీ రోజు చదవడం.. క్లాసులకు వెళ్లడం.. కామన్ లైఫ్ కాబట్టి బోరింగే. కానీ పట్టా అందుకుంటున్న రోజును ఊహించుకుంటేనే ఒక ఫీల్ ఉంటుంది. ఒక యూనివర్సిటీలో ఆ రోజు రావడంతో ఒక యువకుడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. కొంత మేర నెటిజన్లను కూడా యూనివర్సిటీ తీరుపై పెదవి విరిచారు. అసలేం జరిగిందో చూద్దాం.
నర్సీ మాంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ (NMIMS) లో ఇటీవల స్నాతకోత్సవం ఏర్పాటు చేసింది. అందులో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థి ఆర్యా కొఠారీ డిగ్రీ పట్టా తీసుకునేందుకు వేదికపై వెళ్తూ పాట పాడుతూ డాన్స్ చేశాడు. దీంతో అద్యాపకులకు మండింది. ఆర్యా కొఠారీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? అంటూ మండిపడ్డారు. ఇది ఫార్మల్ ఫంక్షన్ అని చెప్పుకచ్చారు. మొదలు డిగ్రీ పట్టా ఇవ్వమని చెప్పారు. కానీ పూర్తిగా విద్యార్థిని మందలించిన తర్వాత ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
మరో వైపు నెటిజన్లు యువకుడికి మద్దతుగా నిలిచారు. ఇన్నాళ్లు కష్టపడి చదివి పట్టా తీసుకునే ఆనందం వ్యక్తం చేస్తూ రెండు స్టెప్పులేస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే తమకు చిరకాలం తీపిగుర్తుగా ఉండే కాన్వకేషన్ రోజు అధ్యాపకులు అలా వ్యవహరించడంపై పెదవి విరుస్తున్నారు.
View this post on Instagram