30.1 C
India
Thursday, May 16, 2024
More

    India vs Australia : వరల్డ్ కప్ లో టీమిండియా ఎంట్రీ నేడే.. ఆస్ర్టేలియాతో ఫస్ట్ మ్యాచ్

    Date:

    India vs Australia :

    ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో ఈ రోజు టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నది  ఆదివారం చెన్నైలోని ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ ఈ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. కాగా , ఈ మ్యాచ్ లు తలపడేది రెండు అగ్రశ్రేణి జట్లే కావడం కీలకంగా మారింది. భారత్ , ఆస్ర్టేలియా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.

    ఇక ఇటీవల ఆస్ర్టేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా నెగ్గింది. ఆఖరి మ్యాచ్ లో ఆస్ర్టేలియాపై ఓడిపోయింది. కాగా, ఆదివారం జరిగే మ్యాచ్ లో గెలిచి, గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఇరు జట్లు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. అయితే టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఆదివారం బరిలోకి దిగడం కష్టంగానే మారింది. ఆయన ప్రస్తుతం డెంగీతో బాధపడుతున్నాడు.  దీంతో తుదిజట్టులో స్వల్ప మార్పులు ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనరగ్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా,  రవి చంద్ర అశ్విన్, కుల్ దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తో కూడిన రోహిత్ సేన బరిలోకి దిగే అవకాశం ఉంది. అటు ఆస్ర్టేలియా టీం కూడా పటిష్ట లైనప్ తో సిద్ధంగా ఉంది.

    ఇక శనివారం దక్షిణఫ్రికా, శ్రీలంక మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఏకంగా దక్షిణాఫ్రికా జట్టు 428 పరుగులు చేసింది. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....