JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్ -1 ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 23 మంది విద్యార్థులు 100 శాతం పర్సంటైల్ సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే పదిమంది ఉండటం విశేషం. తెలంగాణ నుంచి ఏడుగురు ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలి పింది. ఇక జేఈఈ మెయిన్స్ సెషన్-2 ఏప్రిల్ లో జరగనుంది. రెండు పరీక్ష ల్లో వచ్చిన పర్సంటైల్ ఆధారంగా అడ్వాన్స్ కు చేస్తారు.
మొత్తం మీద తెలుగు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంతో కృషి ఉంటే కానీ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులువు కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చదువుతు న్నటువంటి విద్యార్థులు పరీక్షలో ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు జేఈఈ మెయిన్స్-1 లో ఉత్తీర్ణత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.