39 C
India
Sunday, May 19, 2024
More

    Girl Was Raped : బాలికపై ఆరునెలలుగా అత్యాచారం

    Date:

    Girl Was Raped :

    రక్షించాల్సిన వాడే భక్షించాడు. సాయంగా ఉండాల్సిన వాడే ఆమెను పాడు చేశాడు. తన కూతురు ఆలనపాలన చూడాలని ఓ బాలికను తీసుకొచ్చి సపర్యలు చేయించుకున్నాడు. అతడికి పుట్టిన దుర్భుద్ధితో ఆమెపై కన్నేశాడు. లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. దాదాపు ఆరు నెలలు ఆమెపై అత్యాచారం చేశాడు. మూడు నెలల క్రితం గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె నరకయాతన అనుభవించింది.

    అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ అతని భార్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో వారికి పుట్టిన కూతురును చూసుకోవడానికి ఓ బాలికను పనిలో పెట్టుకున్నాడు. తన కూతురును చూసుకుంటున్న బాలికపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం గర్భం దాల్చితే అబార్షన్ చేయించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది.

    లైంగిక వాంఛలు తీర్చుకోవడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసేవాడు. వైరుతో గొంతుకు బిగించి నానా కష్టాలు పెట్టేవాడు. వేధింపులు తాళలేక బాలిక ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఫోక్సో చట్టం కింద సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. రెండో పట్టణ పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

    ఆడపిల్లలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇలా పిల్లల జీవితాలతో ఆడుకునే దుర్మార్గులకు ఉరిశిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూతురు వయసున్న ఆడపిల్లపై అఘాయిత్యం చేయడానికి మనసెలా వచ్చిందని అందరు తిట్టిపోస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...