39 C
India
Sunday, May 19, 2024
More

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    Date:

    No Rains
    No Rains

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కుంభ వర్షం కారణంగా వరదలు వస్తుంటే, మరొక భాగంలో కరువు తాండవిస్తుంది. అలాగే, భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సూర్యుడు సుర్రుమంటుంటే..  ధ్రువాల సమీపంలోని ప్రాంతాలు చలికి వణుకుతున్నాయి. కానీ ఈ భూమిపై 20 మిలియన్ సంవత్సరాల నుంచి ఒక ప్రాంతంలో వర్షాలు లేవు. ఐదారేళ్లు వరుసగా వర్షాలు పడని ప్రాంతాలను చూశాం కానీ, లక్షల ఏళ్లుగా వర్షాలు పడని ప్రాంతం ఉంటుందా? ఆశ్చర్యంగా ఉంది కదా..  అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం ఏదో సహారా ఎడారి కాదు, ఆశ్చర్యకరంగా ఇటీవల ఎడారి దేశం ఎమిరేట్స్‌ను కూడా వర్షాలు ముంచెత్తాయి. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే అటువంటి ప్రాంతంలో లక్షల సంవత్సరాలుగా వర్షాలు కురవకపోవడం నమ్మశక్యంగా లేదు కదా. అయితే ఇది నిజం. అటువంటి శుష్క ప్రాంతం ఒకటి అంటార్కిటిక్ ఖండంలో ఉంది.

    అంటార్కిటికా అనేది భూమి దక్షిణ ధ్రువం వద్ద కొన్ని కిలోమీటర్ల మందంతో మంచుతో కప్పబడిన ఖండం. అతి శీతల ఖండంలో ఉత్తరం వైపు తీరానికి సమీపంలో పొడి ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 4,800 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను ‘డ్రై వ్యాలీస్’ అంటారు. దాదాపు 20 లక్షల ఏళ్లుగా ఇక్కడ వర్షం గానీ, మంచు గానీ పడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా, చాలా ప్రాంతం ఒక్క చుక్క నీరు లేదా మంచు కూడా లేకుండా చాలా పొడిగా ఉంది. అంతేకాదు.. ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య గడ్డకట్టే చలి ఉండడం గమనార్హం. నిజానికి అంటార్కిటికా ఖండంలో గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మంచు ఖండంలో ఇలా పొడిగా ఉండే ప్రదేశాలకు కారణం ‘కటబాటిక్ విండ్స్’ అనే గాలులే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ డ్రైవల్లీస్ ప్రాంతం చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’ అని పిలువబడే పర్వతాలు ఉన్నాయి. డ్రైవాలీల వైపు వీచే గాలులు ఈ పర్వతాలు వాతావరణంలో ఎత్తుగా పెరుగుతాయి. అక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాల మీద పడుతుంది. తేమ లేని పొడి గాలులు.. ఎండిపోయిన లోయల వైపు ప్రయాణిస్తాయి. వీటిని ‘కటాబాటిక్ విండ్స్’ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు.

    డ్రైవాలీస్ అని పిలువబడే ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆ సరస్సుల్లో ఇప్పటికీ ఆనాటి నీరే ఉంది. వర్షాలు లేకపోవడం, మంచు కురుస్తుండటంతో కొత్త నీరు వచ్చే అవకాశం లేదు. వేల సంవత్సరాలుగా వేసవిలో నీరు స్వల్పంగా ఆవిరి కావడం వల్ల ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు నీటి కంటే మూడు రెట్లు ఉప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో విచిత్రం ఏమిటంటే.. పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఇలాంటి ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి. సమీపంలోని సముద్రం, మధ్యలో ఉన్న సరస్సుల నుంచి ఎండిపోయిన లోయల్లోకి వచ్చిన సీల్ జంతువులు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతున్నాయి. చనిపోయిన జంతువుల దేహాలు కుళ్లిపోకుండా వందల, వేల సంవత్సరాల పాటు ‘మమ్మీ’లా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related