Cheepurupally : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతు న్నాయి. ముఖ్యంగా టీడీపీ -జనసేన కూటమి తొ లి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నాటి నుంచి పలు నియోజకవర్గాల్లో నిరసనలు మిన్నం టుతున్నాయి. మరోవైపు మిగిలిన నియోజకవ ర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చీపురుపల్లి మండలం కర్లాంలో ఆ పార్టీ ఇంచార్జి కిమిడి నాగార్జున పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి గంటా శ్రీనివాసరావు బరిలోకి దింపేందుకు చంద్రబాబు భావించారు. దీంతో గంటా చీపురపల్లి నుంచి పోటీచేస్తారన్న సమాచారంతో కొన్నిరోజులుగా నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి నియోజకవర్గంలో నాగార్జున పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
చీపురపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఈసారి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టాలంటే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావును బరిలోకి దింపాలని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో గత నాలుగురోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు గంటాకు సూచించారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం గంటా మీడియా తో మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించా రని, తాను భీమిలి నుంచి పోటీకి ఆసక్తి ఉన్నట్లు చెప్పడం జరిగిందని తెలిపారు. ఎక్కడ నిలపాలో తాను నిర్ణయం తీసుకుంటానని, ఆ విషయం తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు తనకు చెప్పా రని, చంద్రబాబు సూచన మేరకు తాను నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని గంటా చెప్పారు.
చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీతో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేది గంటానే అని దాదాపు ఖాయమైంది. దీంతో చీపురపల్లి టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్న కిమిడి నాగార్జున కొన్నిరోజులుగా నియోజక వర్గా నికి దూరంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవ ర్గంలో శ్రీనివాసరావు బరిలో నిలవడం ఖాయం అనుకుంటున్న సమయంలో నాగార్జున తిరిగి నియోజకవర్గంలో పర్యటిచడం చర్చనీయాంశంగా మారింది.
గంటా చంద్రబాబు ఆదేశాలను తిరస్కరించడంతో నాగార్జున మళ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మొ దలు పెట్టి ఉండొచ్చన్న ప్రచారం నియోజకవర్గం రాజకీయాల్లో జరుగుతుంది. అయితే, టీడీపీ శ్రేణు లు గందరగోళానికి గురవుతున్నారు. టీడీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిపై అధిష్టానం త్వరగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.