39.9 C
India
Tuesday, April 21, 2026
More

    ‘వందేభారత్’ సరికొత్త అప్డేట్

    Date:

    • బోగీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
    • ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
    Vandebharat kishan reddy
    kishan reddy

    Vandebharat Latest Update :ఇది తెలుగు రాష్ర్టాల ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ ట్రైన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో బోగీలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ, రైలుకు వస్తున్న ఆదరణ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.

    తిరుపతి రద్దీ నేపథ్యంలో..

    వేసవి సెలవుల్లో తిరుపతికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తారు. తెలంగాణ నుంచి ముఖ్యంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వందేభారత్ ట్రైన్ మొదలయ్యాక ఈ రైలుకు వస్తున్న ఆదరణ భారీ స్థాయిలో ఉంది. చాలా మంది టికెట్లు దొరక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 120 పైచిలుకు అక్యునెన్సీ నమోదవుతున్నట్లు రైల్వై శాఖ గుర్తించింది కూడా. ఈ మేరకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో స్వయంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు సమావేశమై, తాజాగా సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ బోగీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ బోగీలు అందుబాటులోకి రానున్నట్లుగా సమాచారం. సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే వారికి ఇది మరింత సౌలభ్యం కానుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో పాటు రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Kishan Reddy : బీజేపీ జాతీయాధ్యక్ష పదవి రేసులో కిషన్ రెడ్డి, సంజయ్!

    Kishan Reddy : పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం BJP తీవ్రంగా కసరత్తు...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....