31.6 C
India
Sunday, May 19, 2024
More

    Varalaxmi Sarathkumar : ఇన్నాళ్లకు పెళ్లి ఆలోచన చేస్తున్న వరలక్ష్మీ?

    Date:

    Varalakshmi who is thinking of marriage
    Varalakshmi who is thinking of marriage

    Varalaxmi Sarathkumar : హనుమాన్ సినిమా ఎంత సంచలనం కలిగించిందో తెలిసిందే. బాక్సాఫీసు చరిత్రను తిరగరాసింది. ఇటీవల కాలంలో రికార్డులు బద్దలు కొట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగులో వచ్చిన చిత్రాల్లో మంచి రోల్స్ చేస్తూ హిట్ కొడుతోంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా ఖ్యాతి గాంచింది. ఈ సినిమా సంచలన విజయం వెనుక ఎంతో మంది పనితనం దాగి ఉందని తెలుస్తోంది.

    ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించింది. ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి విజయాలు సాధిస్తోంది. మొదట హీరోయిన్ గా చేసినా తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సంచలనాలు చేస్తోంది. క్రాక్ సినిమాలో రవితేజతో నటించి శభాష్ అనిపించుకుంది. వీరసింహారెడ్డిలో బాలయ్య చెల్లెలుగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అన్న మీద కసితీర్చుకునే చెల్లెలు పాత్రల అద్భుతంగా నటించింది.

    ఆమె పెళ్లిపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే 40 ఏళ్లు దాటిన ఆమె ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కాలని చూస్తోంది. ఈమె గతంలో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరో సూపర్ స్టార్ ధనుష్ తో పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం. శింబుతో కూడా ప్రేమాయణం సాగించినట్లు తెలిసింది. వీరిరువురి మధ్య ఎలాంటి ప్రేమలేదని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం వీరు మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నారు.

    తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాత్రలు పోషిస్తోంది. సినిమా పరిశ్రమలో నలభై ఏళ్లు దాటాకే పెళ్లి ఆలోచన చేస్తున్నారు. దీంతో వరలక్ష్మి కెరీర్ మంచి పొజిషన్ లో ఉండగానే వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతోందని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...