28 C
India
Friday, May 17, 2024
More

    Chandrababu : చంద్రబాబు క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఏమవుతుందో ?

    Date:

    Chandrababu
    Chandrababu cash petition in supreme court

    Chandrababu : వర్తమాన రాజకీయాలలో ఏ కేసులైనా అధికార పార్టీకి జమ్మి చెట్టు మీద పాండవులు దాచి పెట్టిన అస్త్ర శాస్త్రాల వంటివే. అవసరమైనప్పుడు వాటిని కిందకుదించి ప్రత్యర్ధుల పై ప్రయోగిస్తుండటం మనమందరం  చూస్తుంటాం..

    టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌ మెంట్‌ కేసులో జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ప్రతీరోజూ వార్తల్లో సుప్రీంకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ గురించే మీడియా లో వార్తలు వస్తుండేవి. ముఖ్యంగా ఆ కేసులో సెక్షన్ 17ఏపై  సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చివరికి ఆ కేసులో చంద్రబాబు నాయు డు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు అక్టోబర్ 17న సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే..

    వారం పదిరోజులలోగా తీర్పు వెల్లడిస్తుందని అందరూ భావించగా రెండు నెలలైనప్పటికీ ఇంత వరకు తీర్పు వెల్లడించలేదు. కానీ బెయిల్‌పై ఉన్న  చంద్రబాబు నాయుడు రాజకీయ సభలు, సమావే శాలలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించ డంతో, ఆయన రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్‌ అయ్యారని చెప్పుకోవచ్చు..

    సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ సంగతి దాదాపు అందరూ మరిచిపోయారనే చెప్పవచ్చు. చంద్రబా బు నాయుడు తరపు న్యాయవా దులు కూడా సుప్రీం కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు గురించి తొందరప డకపోవడం గమనిస్తే, తీర్పు ఆయనకు సానుకూ లంగా ఉంటుందనే నమ్మకంతోనే వారు ఉన్నట్లు తెలుస్తోంది.

    త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నిక లకు ముందే సుప్రీం కోర్టులోని ఈ కేసుతో సహా అన్ని కేసుల నుంచి చంద్రబాబు నాయుడుకి విముక్తి లభిస్తే వ్యక్తిగ తంగా ఆయనకు, రాజకీ యంగా టిడిపికి కూడా చాలా మంచిదని అందరూ భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...