
OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరున్న డైరెక్టర్ ఆయన డైరెక్షన్ లో రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో వచ్చిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ మే 1న ఓటీటీలోకి నేరుగా విడుదలైంది. ఇది విడుదలైనప్పటి నుంచి ఓటీటీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మొదటి వారంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సిరీస్ గా ఇది అగ్రస్థానానికి ఎగబాకింది.
‘హీరామండి’ 43 దేశాల్లో టాప్ 10 ఛార్టుల్లో గొప్ప స్థానం సంపాదించుకోవడమే కాకుండా నాన్-ఇంగ్లిష్ టీవీ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 4.5 మిలియన్ వ్యూస్, 33 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ తో ఈ సిరీస్ అందరి అంచనాలను తలకిందులు చేసింది.
కఠినమైన పోటీని ఎదుర్కొన్నప్పటికీ, ‘హీరామండి’ తన మొదటి వారంలో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ వంటి ప్రజాదరణ పొందిన షోలు, ప్రధాన అంతర్జాతీయ నెట్ ఫ్లిక్స్ నిర్మాణాలను కూడా అధిగమించగలిగింది.
అయితే, ఈ సిరీస్ ఇంత విజయం సాధించినప్పటికీ, భారీ ఫ్లాప్ అని ఇది వాస్తవికత, వ్యూవర్స్ ఫీడ్ బ్యాక్ కు తగ్గట్లుగా లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
లోపాలు లేకుండా లేకపోయినా, భన్సాలీ సిగ్నేచర్ స్టయిల్, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సాధారణ ఓటీటీ కంటెంట్ కు రిఫ్రెషింగ్ బ్రేక్ ఇస్తుంది. అవును, ఈ సిరీస్ స్క్రీన్ ప్లేలో అప్పుడప్పుడు డల్ మూమెంట్స్ తో సాగుతుంది.
వెబ్ సిరీస్ పై నెగిటివిటీని స్ర్పెడ్ చేసేందుకు ఏదో ప్రధాన ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సిరీస్ పాకిస్తాన్ లో తెరకెక్కి వేశ్యలను కీర్తిస్తోందనే కారణంతో కొందరు విద్వేషాన్ని వ్యాప్తి చేశారు.
భారతీయ వెబ్ సిరీస్ లు, ముఖ్యంగా రూ. 200 కోట్ల హీరామండి వంటి భారీ బడ్జెట్ సిరీస్ లు చాలా ఇబ్బంది కరంగా ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫాం భవిష్యత్ పెట్టుబడులపై సందేహాలను రేకెత్తిస్తోంది.
అయితే ఈ సందేహాలకు భిన్నంగా ‘హీరమండి’ పలు అంతర్జాతీయ షోలను అధిగమించి వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ నిలిచింది. మరికొంత కాలం కూడా టాప్ లో నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్, సంభావ్య పెట్టుబడిదారులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో మర్డర్ ముబారక్ వంటి కొన్ని వాష్ అవుట్స్ వచ్చాయి, కానీ హీరామండి అలాంటి సిరీస్ కాదు.