41.1 C
India
Monday, May 20, 2024
More

    Curse For Team India : భారత్ కు అదే శాపంగా మారనుందా?

    Date:

    Curse For Team India
    Curse For Team India

    Curse For Team India : 2023 ప్రపంచ కప్ లో భారత్ విజయాల దూకుడు మీదుంది. ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2011 నుంచి 2019 వరకు జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో టాప్ ప్లేసులో ఉన్న జట్టు కప్ ను కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇదే భారత్ కు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందా అనే వాదనలు వస్తున్నాయి.

    టీమిండియా నెదర్లాండ్స్ తో జరిగే పోరులో ఓడినా లీగ్ స్టేజ్ ను టాప్ పొజిషిన్ తో ముగిస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఇండియాకు శాపంగా మారనుందని అంటున్నారు. వరల్డ్ కప్ లో టాప్ లో ఉన్న జట్టు కప్ గెలిచిన సందర్భాలు లేవు. దీంతో భారత్ ఆ ఘనత సాధించి చరిత్ర లిఖిస్తుందా? లేక సంప్రదాయానికే పెద్దపీట వేస్తుందా అనేది తెలియడం లేదు. దీనిపై క్రీడా విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    2011-2019 మధ్య మూడు ప్రపంచ కప్ లు జరిగాయి. ఇందులో ప్రధానంగా ఏ టాప్ జట్టు కూడా కప్ ను సొంతం చేసుకోలేదు. 2011 వన్డే వరల్డ్ కప్ రెండు గ్రూపులుగా జరిగింది. గ్రూప్ ఏ లో పాకిస్తాన్ టాప్ గా నిలిచింది. గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా నిలిచాయి. కానీ ఈ రెండు జట్లు కాకుండా కప్ ను భారత్ గెలుచుకుంది. అలా వరల్డ్ కప్ లో టాప్ గా నిలిచిన జట్టు కప్ గెలిచినా దాఖలాలు లేవు.

    2015 వరల్డ్ కప్ లో కూడా రెండు గ్రూపులుగా జరిగింది. గ్రూప్ ఏ లో న్యూజిలాండ్, గ్రూప్ బి లో భారత్ లు టాప్ లో కొనసాగాయి. కప్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. 2019 వరల్డ్ కప్ లో కూడా ప్రస్తుత ఫార్మాట్ లోనే జరిగింది. అప్పుడు లీగ్ దశలో భారత్ టాపర్ గా ఉంది. కప్ మాత్రం ఇంగ్లండ్ సాధించింది. ఈ సంప్రదాయం ప్రకారం చూస్తే టాప్ లో నిలిచిన టీమిండియా ఆశలు అడియాశలయ్యే అవకాశాలే అవుతాయా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. సెమీస్, ఫైనల్ లో ఏం చేస్తుందో చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...