
Kannada results 2023 : పొరుగు వారు కన్నడిగులతో తెలంగాణకు మంచి సంబంధాలే ఉంటాయి. అక్కడ బుధవారం (మే 10)న పోలింగ్ జరగగా రేపు (మే 13)న రిజల్ట్స్ రానున్నాయి. అక్కడి వారి తీర్పు మనపై ఎంతో కొంత ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కన్నడ నాట ఏ ప్రభుత్వాలు కూడా రెండో సారి సీఎం పీటం అధిరోహించడం చాలా అరుదుగా ఉంటుంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి తప్పకుండా కర్ణాటకలో ప్రభుత్వం మారుతుంటుంది. ఈ సారి తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కన్నడ తీర్పుపై బాగా చర్చ జరుగుతుంది. వీటి ఫలితాలు తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపచ్చని తెలుస్తోంది.
ఈ సారి ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయి. గత ప్రభుత్వం బీజేపీ ఉంటే.. ఈ సారి కాంగ్రెస్ రావడం అక్కడ కామన్. ఇది అందరికీ తెలిసిందే. అయితే తమ గెలుపు కోసం బీజేపీ బాగా పోరాడింది. ఇందులో జేడీఎస్ కొంచెం మేర ప్రేక్షక పాత్ర పోషించినా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దాని పాత్ర ప్రధానంగానే ఉంటుంది. ఇటు బీజేపీకి లేదంటే కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ సారి కాంగ్రెస్ కాకుండా బీజేపీ మళ్లీ గెలిస్తే రికార్డు తిరగరాసినట్లే. రెండో సారి కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీగా కీర్తికెక్కుతుంది. దీని ప్రభావం సౌత్ పై తీవ్రంగా ఉంటుంది.

సౌత్ స్టేట్స్ లో తెలంగాణ ఎన్నికలు మరో ఆరు నెలల్లో రానున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ బీజేపీ గెలిస్తే మాత్రం పూర్తి ప్రభావం తెలంగాణపై ఉంటుంది. బీజేపీ తెలంగాణలో బాగా విస్తరిస్తుంది. కార్యకర్తలు, పటిష్ట నాయకత్వం పెరుగుతూ వస్తోంది. బండి సారధ్యంలో నాయకులు సక్సెస్ అవుతూ వస్తున్నారు. కర్ణాటక స్టేట్ తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణకు రానుంది. ఇక ఇక్కడ కూడా పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చే వ్యూహాలు రాచించనున్నారు. కేడర్ ను ఉత్తేజ పరుస్తూ ఉద్యోగులు, యూత్ ను ఎక్కువగా ఆకర్షించుకుంటున్నారు.
ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా దీనికే మొగ్గు చూపాయి. గతంలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ రావడం కామన్. ఈ ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదు. కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పడానికి లేదు. పొరుగు రాష్ర్టం కాబట్టి కర్ణాటక గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. నాయకుల కుమ్ములాటల నడుమ ఇక్కడి కాంగ్రెస్ కేడర్ నిస్తేజం అయిపోయింది. ఇప్పటికి ఇప్పుడు వాళ్లకు బూస్ ఇచ్చినా తిరిగి పుంజుకునేలా కనిపంచడం లేదు.
ఇక బీఆర్ఎస్ గురించి పరిశీలిస్తే.. తెలంగాణలో రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పదేళ్లు ఎవరూ పవర్ లో లేరు. చంద్రబాబు 9 సంవత్సరాల తర్వాత ముందస్తుకు వెళ్లి బోల్తాపడ్డాయి. వైఎస్ఆర్ దాదాపు 9 సంవత్సరాల కాలంలో మృత్యువాత పడ్డాయి. సరే ఇవన్నీ పక్కనుంచితే ఈ సారి తెలంగాణలో ప్రభుత్వం బదలాయింపు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే అది కాంగ్రెస్ వస్తుందా.. లేక బీజేపీ వస్తుందా అనేది కొంచెం కన్ ఫ్యూజన్ గానే ఉన్నా. ఎక్కువ సోర్స్ మాత్రం బీజేపీకే ఉంది.