
నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేశారు. కేవలం 10 సెకన్ల లోనే నోయిడా ట్విన్ టవర్స్ ని కూల్చివేశారు అధికారులు. ఒక్కసారిగా ట్విన్ టవర్స్ నేలమట్టం కావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. ఈ పేలుడు కోసం 3700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు అధికారులు.
ఈ ట్విన్ టవర్స్ 1200 కోట్ల విలువైనవి కావడం గమనార్హం. అనుమతి లేకుండా ఈ ట్విన్ టవర్స్ నిర్మించడంతో సుప్రీం కోర్టు కూల్చివేతే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడా ట్విన్ టవర్స్ ని కూల్చివేశారు. ఇక ఈ టవర్స్ కూల్చివేతకు 20 కోట్లు ఖర్చు చేశారు.