కరోనా ఫస్ట్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తే సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక సెకండ్ వేవ్ కల్లోలం చూసి షాక్ అవుతున్న ప్రజలకు రాబోయే థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తుండటంతో పిల్లలున్న తల్లుదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందట.
ఆ జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దామా !
పిల్లలను ప్రతీ రోజు ఒక గంట సేపు ఎండలో ఉండేలా చూడాలి.
నువ్వులను బెల్లంతో కలిపి చేసిన ఉండలు , అలాగే వేరుశనగతో బెల్లం కలిపిన పల్లి పట్టి తినిపిస్తే పిల్లలకు చాలామంచిది.
మొలకలు , పండ్లు , రాగి జావ , అరటి పండ్లు , మజ్జిక ప్రతీ రోజు ఇవ్వాలి .
జంక్ ఫుడ్ , ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టొద్దు
ఆకుకూరలు , కూరగాయలు మరింత బలాన్ని ఇస్తాయి అందుకే వాటిని ఎక్కువగా తినిపించండి.
ఫ్రిజ్ లో ఉన్న ఆహార పదార్థాలు అస్సలు పెట్టొద్దు.
కోవిడ్ కారణంగా గత ఏడాది కాలం నుండి ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మానసికంగా కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది అందుకే వాళ్లతో కొంత సమయం గడపడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి వీలౌతుంది.
వీలు కుదిరితే స్వంత ఊళ్లకు తీసుకెళ్లి ఆ మట్టిలో వాళ్ళని ఆడుకునేలా చేస్తే మంచి ప్రయోజనముంటుంది. దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉంది.
మంచి నీళ్లలో తులసి ఆకులు , పుదీనా ఆకులు వేసి తాగిస్తే మంచిది.
నిమ్మరసం తాగించాలి , అలాగే ఉసిరి కాయలు తినిపించాలి అలాగే పుచ్చకాయలు కూడా.
వారానికి ఒకసారి 4 వేపాకులు పొద్దున్నే తినిపిస్తే మంచిది.
నీళ్లు సంవృద్ధిగా తాగించాలి. అలాగే పొద్దున్నే కొంచెం తేనె అయినా తినిపించాలి.