సరస్వతీదేవిని భక్తి శ్రద్దలతో పూజించే పండుగనే వసంత పంచమి అని అంటారు. వసంత పంచమి పండగ ఈ ఫిబ్రవరి 5 న రాబోతోంది. ఆ రోజున హిందువులు భక్తి శ్రద్దలతో సరస్వతీదేవిని పూజిస్తారు. మాఘ శుక్ల పంచమి రోజున జన్మించింది సరస్వతీదేవి. పసుపు రంగు అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ఆరోజున పసుపు బట్టలు ధరించడమే కాకుండా పసుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు.
అమ్మవారి పూజలో నైవేద్యం కోసం ఉంచే ఆహార పదార్థాలు : లడ్డు , పెసరపప్పు హల్వా , రవ్వ కేసరి , కుంకుమపువ్వు స్వీట్ రైస్. లడ్డులలో రకరకాలు ఉంటాయి. ఇక బేసిన్ లడ్డు అనేది ఉత్తరాది స్వీట్. ఇది చూడటానికి కూడా మరింత అందంగా నోరూరించేలా ఉంటుంది. సరస్వతీదేవి అమ్మవారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.