38.1 C
India
Sunday, May 19, 2024
More
    Home Blog Page 1530

    సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం

    ganesh-immersion-under-sai-dutta-peetham
    ganesh-immersion-under-sai-dutta-peetham
    ganesh-immersion-under-sai-dutta-peetham
    ganesh-immersion-under-sai-dutta-peetham

    అమెరికా  న్యూజెర్సీలో గల ఎడిసన్ లోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. JSW & Jaiswaraajya అడ్వైజర్ , Ublood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , లావణ్య జగదీష్ యలమంచిలి, JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, రమేష్ యలమంచిలి, రఘు శర్మ, JSW & Jaiswaarjya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గణేష్ నిమజ్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 

    ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.

    బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఇక లేరు

    queen-elizabeth-of-britain-is-no-more
    queen-elizabeth-of-britain-is-no-more
    queen-elizabeth-of-britain-is-no-more
    queen-elizabeth-of-britain-is-no-more

    బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ – || ఇక లేరు. 96 ఏళ్ళ ఎలిజబెత్ 2 బ్రిటన్ లో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిగా నిలిచారు. దాదాపు 70 సంవత్సరాల పాటు బ్రిటన్ ని పరిపాలించారు. విరామం కోసం స్కాట్లాండ్ లోని బల్మోరల్ కోటకు వెళ్లిన సమయంలోనే తుదిశ్వాస విడిచారు రాణి. దాంతో బ్రిటన్ లో 10 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇక రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలు 10 రోజుల తర్వాత లండన్ లోని వెస్ట్ మినిష్టర్ అబ్బే చర్చిలో నిర్వహించనున్నారు. క్వీన్ ఎలిజబెత్ మృతికి ప్రధాని మోడీతో పాటుగా పలువురు దేశాధినేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

    DIVYAVANI- ETELA RAJENDER: ఈటల రాజేందర్ ను కలిసిన దివ్యవాణి

    divyavani-etela-rajender-divyavani-met-etela-rajender
    divyavani-etela-rajender-divyavani-met-etela-rajender
    divyavani-etela-rajender-divyavani-met-etela-rajender
    divyavani-etela-rajender-divyavani-met-etela-rajender

    సినీ నటి దివ్యవాణి బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ను కలిసింది. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్ళింది దివ్యవాణి. ఈటల రాజేందర్ ను కలిసి పలు అంశాలపై చర్చించింది. అయితే ఏ ఏ అంశాల మీద ఇద్దరు చర్చించారు అన్నది తెలియరాలేదు కానీ దివ్యవాణి కూడా కొంత కాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన దివ్యవాణి జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే తెలుగుదేశం పార్టీలో తనకు అవమానాలు ఎదురు అవుతున్నాయని భావించి ఆ పార్టీకి రాజీనామా చేసింది. ఇక ఇప్పుడేమో ఈటల రాజేందర్ ను కలవడంతో బీజేపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. 

    PURI JAGANNATH: అద్దె కట్టలేక ఫ్లాట్ ఖాళీ చేసిన పూరీ జగన్నాథ్

    puri-jagannath-puri-jagannath-vacated-the-flat-because-he-could-not-pay-the-rent
    puri-jagannath-puri-jagannath-vacated-the-flat-because-he-could-not-pay-the-rent
    puri-jagannath-puri-jagannath-vacated-the-flat-because-he-could-not-pay-the-rent
    puri-jagannath-puri-jagannath-vacated-the-flat-because-he-could-not-pay-the-rent

    లైగర్ చిత్రం ప్లాప్ కావడంతో ఒక్కసారిగా పూరీ జగన్నాథ్ జాతకం తిరగబడింది. దాంతో లైగర్ ఆఫీస్ కోసం తీసుకున్న ఇంటిని ఖాళీ చేసాడట. అయితే అది ఇక్కడ హైదరాబాద్ లో కాదు సుమా ! ముంబైలో. లైగర్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ – ఛార్మి సంయుక్తంగా లైగర్ చిత్రాన్ని నిర్మించారు.

    అయితే లైగర్ పై భారీ అంచనాలు ఉండటంతో పెద్ద హిట్ అవుతుందని , ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని అందునా ముంబై లో వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే ముంబైలో నెలకు 15 లక్షలు పెట్టి మరీ ఆఫీస్ తీసాడు. ఇందులో 10 లక్షల రెంట్ కాగా మిగతా సొమ్ము మెయింటనెన్స్ కింద మరో 5 లక్షలు అంటే మొత్తానికి 15 లక్షలు అన్నమాట.

    లైగర్ ప్లాప్ కావడంతో బయ్యర్లు పూరీ ఆఫీస్ మీద పడుతున్నారు. ఒకవైపు ఆ గోల ఉంటే మరోవైపు ఖర్చులు భరించలేనివిగా ఉండటంతో చేసేదిలేక ముంబైలోని ఆఫీసు ఖాళీ చేసాడట. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. కొద్దిరోజుల తర్వాత కానీ మిగతా విషయాల గురించి ఆలోచించేంత ఓపిక లేదన్న మాట. 

    SHARWANAND: శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమా మీదే

    sharwanand-all-the-hopes-of-sharwanand-belong-to-that-movie
    sharwanand-all-the-hopes-of-sharwanand-belong-to-that-movie
    sharwanand-all-the-hopes-of-sharwanand-belong-to-that-movie
    sharwanand-all-the-hopes-of-sharwanand-belong-to-that-movie

    శర్వానంద్ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన సినిమాలన్నీ ఘోరంగా దెబ్బకొట్టాయి. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తాజాగా ” ఒకే ఒక జీవితం ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వా.

    ఒకే ఒక జీవితం సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం శర్వానంద్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. చాలాకాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వాకు ఈ ఒకే ఒక జీవితం తప్పకుండా హిట్ ని ఇస్తుందన్న ధీమాతో ఉన్నాడు. ఈ చిత్రంలో అమల కీలక పాత్రలో నటించడం విశేషం.

    ఆగస్టు నెల టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార , దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం , నిఖిల్ కార్తికేయ 2 ఇలా మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మాత్రం వచ్చిన చిత్రాలు దారుణంగా దెబ్బకొట్టాయి. సెప్టెంబర్ నెల ప్రారంభమైంది కానీ మూడు చిత్రాలు అలా వచ్చాయి …… వచ్చినవి వచ్చినట్లుగానే పోయాయి. దాంతో ఒకే ఒక జీవితం చిత్రం హిట్ కొట్టి బాక్సాఫీస్ కు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తుందా ? అని బయ్యర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి శర్వాకు ఈ సినిమా హిట్ ని ఇస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

    Nehhaa Malik Photoshoot

    Nehhaa Malik Photoshoot
    Nehhaa Malik Photoshoot

    Neelam Kaur Gill Photoshoot

    Neelam Kaur Gill Photoshoot
    Neelam Kaur Gill Photoshoot

    Sita Ramam Movie Wallpapers

    Sita Ramam Movie Wallpapers
    Sita Ramam Movie Wallpapers

    RRR Movie Wallpapers

    RRR Movie Wallpapers

    Vijay Devarakonda Latest Photoshoot

    Vijay Devarakonda Latest Photoshoot
    Vijay Devarakonda Latest Photoshoot