గ్రీన్ కార్డులను వృథా చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా. అమెరికాలో శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటున్న భారతీయుల సంఖ్య ఎక్కువ. అమెరికాలో స్థిరపడాలని , శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్న భారతీయులకు గ్రీన్ కార్డు ఇవ్వకుండా వృథా చేస్తోంది అమెరికా. గత ఏడాదిలో గ్రీన్ కార్డ్ కోసం 2,62,288 మంది గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేసుకోగా అందులో 1,95, 507 మందికి మాత్రమే గ్రీన్ కార్డు ఇచ్చారు. 66, 781మందికి గ్రీన్ కార్డు వీసాలను నిరాకరించారు.
అంటే ఒక్క ఏడాదిలోనే 66,781 గ్రీన్ కార్డులను వృథా చేసారు అమెరికా అధికారులు. ఈ గ్రీన్ కార్డులను వృథా చేయకుండా వివిధ కేటగిరీలలో కేటాయిస్తే గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. గ్రీన్ కార్డుల వృథా విషయాన్ని డేవిడ్ జె బియర్ వెలుగులోకి తెచ్చాడు. దాంతో భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.