ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా ) ప్రతినిధులు. వాషింగ్టన్ డీసీ లో జూలై 1 నుండి 3 వరకు 17 వ ఆటా తెలుగు మహాసభలను మూడు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు ఆటా ప్రతినిధులు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
వీలుచూసుకొని ఆటా సమావేశాలకు తప్పకుండా హాజరు కావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. అమెరికాలో తెలుగు వాళ్ళ కోసం ఆటా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకొని వాళ్ళని అభినందించారు. సీఎం జగన్ ని కలిసిన వాళ్లలో ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బూజల, కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి లింగాల , ఆటా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సన్నీ రెడ్డి , ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్ జయంత్ చల్లా తదితరులు ఉన్నారు.