
2020 భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే మర్చిపోలేని సంవత్సరం ఎందుకంటే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందరి జీవితాలను తల్లకిందులు చేసిన సంవత్సరం ఇది. 2020 లో మార్చి 25 న భారతదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆ లాక్ డౌన్ ని మళ్ళీ మళ్ళీ పొడిగిస్తూ మే 31 వరకు తీసుకెళ్లారు. ఇక జూన్ నుండి లాక్ డౌన్ ఎత్తేసారు కానీ పలు ఆంక్షలు విధించారు.
ఇక ఇదే సమయంలో భారత్ కు ఇతర దేశాలకు చెందిన వాళ్ళు బాగానే సందర్శించారు. 2020 లో భారత్ లో సందర్శించిన వాళ్ళ సంఖ్య 32. 79 లక్షలు ఉండగా అందులో అత్యధికంగా అమెరికన్లు 61 వేల మంది ఇండియాని సందర్శించారు. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (37,774) , యూకే (33,323) , కెనడా ( 13,707) , పోర్చుగల్ (11,668), ఆఫ్గనిస్తాన్ (11, 212) మంది సందర్శించిన జాబితాలో ఉన్నారు.