తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని స్థాపించి 21 ఏళ్ళు అవుతున్న సందర్బంగా లండన్ లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో అన్ని దేశాల్లో టీఆర్ఎస్ విభాగాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే లండన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.
కార్యక్రమంలో మొదట పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం అమర వీరులకు 2 నిముషాలు మౌనం పాటించారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు పాల్గొన్నారు.